తండ్రిపై మమకారం.. మృతదేహం 18 నెలలుగా ఇంట్లోనే!

నెదర్లాండ్స్‌కు (Netherlands) చెందిన 82 ఏళ్ల ఓ వ్యక్తి తన తండ్రి మృతదేహాన్ని 18 నెలలపాటు ఫ్రీజర్‌లో భద్రపరచుకున్నాడు. తండ్రిపై మమకారాన్ని వీడలేకే ఇలా చేసినట్లు అతడు చెబుతున్నాడు.

Published : 13 May 2023 01:46 IST

ఆమ్‌స్టర్‌డాం: ఆయనో 82 ఏళ్ల వృద్ధుడు. 101 ఏళ్ల వయస్సున్న తన తండ్రి ఏడాదిన్నర క్రితమే మరణించాడు. తండ్రిపై మమకారం వీడలేక.. ఫ్రీజర్‌ (Freezer) తీసుకొచ్చి ఇంట్లోనే మృతదేహాన్ని భద్రపరచుకున్నాడు. రోజూ తండ్రి శవం ముందు కూర్చొని మాట్లాడే వాడు. ఇలా ఒకటి, రెండు కాదు.. 18 నెలలపాటు కొనసాగించాడు. ఈ ఘటన నెదర్లాండ్స్‌లోని (Netherlands) ల్యాండ్‌గ్రాఫ్‌ పట్టణంలో జరిగింది. ఫ్యామిలీ డాక్టర్‌ వాళ్ల ఇంటికి వెళ్లి పరిశీలించగా విషయం వెలుగులోకి వచ్చింది.

‘‘నేను నా తండ్రిని కోల్పోదలచుకోలేదు. ఆయన లేకుండా నేను ఉండలేను. అందుకే ఆయన మృతదేహాన్ని భద్రపరచుకున్నాను’’ అని ల్యాండ్‌గ్రాఫ్‌ పోలీసులకు మృతుడి కొడుకు చెప్పినట్లు అంతర్జాతీయ వార్తాపత్రిక అవుట్‌లెట్‌ పేర్కొంది. సమాచారం అందుకున్న ల్యాండ్‌ గ్రాఫ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరిపై ఎలాంటి అనుమానాలు లేవని, ఇది సాధారణ మరణంగానే భావిస్తున్నామని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతామని అన్నారు. అయితే, ఫ్రీజర్‌లో ఎందుకు భద్రపరచాల్సి వచ్చిందన్న దానిపై వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నట్లు చెప్పారు.

గతంలో ఇలాంటి సంఘటనే నెదర్లాండ్స్‌లో 2015లోనూ జరిగింది. తన తల్లి పింఛను సొమ్ముకోసం ఆశ పడిన ఓ వ్యక్తి తల్లి మృతదేహాన్ని ఏకంగా రెండేళ్లపాటు ఫ్రీజర్‌లో పెట్టేశాడు. చివరికి విషయం బయటకి పొక్కడంతో పోలీసుల చేతికి చిక్కాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు