Published : 28 Jun 2022 14:31 IST

Editors Guild: మహ్మద్‌ జుబైర్‌ అరెస్టును ఖండించిన ఎడిటర్స్‌ గిల్డ్‌

వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌

దిల్లీ: ఒక వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారనే ఆరోపణలపై ఫ్యాక్ట్‌చెక్‌ (Fact check) వెబ్‌సైట్‌ ఆల్ట్‌న్యూస్‌ సహ వ్యవస్థాపకుడు మహ్మద్‌ జుబైర్‌ (Muhammad Zubair) అరెస్టును ఎడిటర్స్‌ గిల్డ్‌ (Editors Guild) ఖండించింది. అరెస్టైన జుబైర్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. ప్రజల్లో విభజన తెచ్చేందుకు తప్పుడు సమాచారాన్ని సాధనంగా వాడుకునే వారికి అడ్డుకట్ట వేస్తోన్న ఇటువంటి వారిని హెచ్చరించేలా తాజా పరిణామం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని చెబుతూ ఓ ప్రకటన విడుదల చేసింది.

‘ఐపీసీ సెక్షన్‌ 154, 295ల కింద కేసు నమోదు చేసి జుబైర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ వార్తలను గుర్తించడంతోపాటు తప్పుడు సమాచారాన్ని అడ్డుకునేందుకు ఆల్ట్‌న్యూస్‌ వెబ్‌సైట్‌ ద్వారా శాస్త్రీయ పద్ధతిలో గత కొన్నేళ్లుగా ఎంతో కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జుబైర్‌ను అరెస్టు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దిల్లీ పోలీసులు జుబైర్‌ను వెంటనే విడుదల చేయాలి’ అని ఎడిటర్స్‌ గిల్డ్‌ డిమాండ్‌ చేసింది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ కంటెంట్‌ రక్షణ ద్వారా సుస్థిరమైన ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉంటామని జర్మనీలో జరిగిన జీ-7 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లుగానే అందుకు కట్టుబడి ఉండటం ఎంతో అవసరమని పేర్కొంది. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే జర్నలిస్టులపై కఠినమైన చట్టాలను సాధనంగా వాడడాన్ని వెంటనే నిలివేయాలని.. ఈ సమయంలో జుబైర్‌కు మద్దతుగా నిలబడతామని ఎడిటర్స్‌ గిల్డ్‌ స్పష్టం చేసింది.

మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై మహ్మద్‌ జుబైర్‌ను దిల్లీ పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్ట్‌ చేశారు. ముఖ్యంగా ఇటీవల ఆయన చేసిన ట్వీట్‌లు అత్యంత రెచ్చగొట్టేవిగా ఉన్నాయని.. ప్రజల్లో ద్వేషాలను కలిగించేవిగా ఉన్నాయంటూ దిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. 2018 నాటి కేసులో అరెస్ట్‌ చేయకుండా హైకోర్టు నుంచి జుబైర్‌కు రక్షణ ఉన్నట్లు సమాచారం. దీంతో మరో కేసులో జుబైర్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు ఒక రోజు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే, గతంలో చేసిన ట్వీట్‌లను ఆయన తొలగించినట్లు గుర్తించిన పోలీసులు.. వాటిని రికవరీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని