JetBlue: విమానం ల్యాండింగ్‌కు ముందు ప్రతికూల వాతావరణం.. గాయపడిన ప్రయాణికులు

కాసేపట్లో ల్యాండ్‌ అయ్యే సమయానికి విమానం భారీ కుదుపులకు లోనైంది. దీంతో కొందరు ప్రయాణికులు గాయపడ్డారు. 

Updated : 26 Sep 2023 17:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ల్యాండ్‌ అయ్యేందుకు కొన్ని నిమిషాల ముందు ఓ విమానం భారీ కుదుపులకు లోనైంది. దీంతో కొందరు ప్రయాణికులతో సహా ఒక సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటన జెట్‌బ్లూ (JetBlue) సంస్థకు చెందిన విమానంలో చోటు చేసుకుంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం..

ఈక్వెడార్‌ నుంచి  అమెరికా ఫ్లోరిడాలోని ఫోర్ట్‌ లాడర్‌డేల్‌కు బయలుదేరిన ఎయిర్‌బస్‌ A320 విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్‌ కొన్ని నిమిషాల ముందు భారీ కుదుపులకు లోనైంది. దీంతో ప్రయాణికులంతా భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఏడు ప్రయాణికులతో సహా ఒక సిబ్బంది గాయపడ్డారు. విమానాన్ని కంట్రోల్‌ చేసిన పైలట్‌ సురక్షితంగా ల్యాండింగ్‌ చేశారు.

గ్యాస్‌ స్టేషన్‌లో పేలుడు.. 20 మంది మృతి, 300 మందికి తీవ్ర గాయాలు

అనంతరం గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే గాయల తీవ్రతను వెల్లడించలేదు. బాధితులు కోలుకునేందుకు తమ సహకారం అందిస్తామని జెట్‌బ్లూ అధికారులు తెలిపారు. అసలు ప్రమాదం జరగడానికి గల కచ్చితమైన కారణం తెలియాల్సి ఉంది.నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డ్‌ (NTSB) ఈ ఘటనపై విచారణ చేపట్టింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని