Elon Musk :కెనడా ప్రధానిని హిట్లర్‌తో పోల్చిన మస్క్‌.. ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు

టెస్లా, స్పేస్‌ఎక్స్‌ కంపెనీల సీఈవో ఎలాన్ మస్క్‌ ఓ ట్వీట్‌ చేసి విమర్శలపాలవుతున్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోని జర్శనీ నియంత అడాల్ప్‌ హిట్లర్‌తో పోల్చుతూ ట్వీట్‌ చేయడమే ఇందుకు గల కారణం. దీనిపై దూమారం రేగడంతో ఆయన దాన్ని డిలీట్ చేశారు.

Published : 19 Feb 2022 01:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెస్లా, స్పేస్‌ఎక్స్‌ కంపెనీల సీఈవో ఎలాన్ మస్క్‌ చేసిన ఓ ట్వీట్‌ విమర్శలకు తావిచ్చింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోని జర్మనీ నియంత హిట్లర్‌తో పోల్చడమే ఇందుకు కారణం. దీనిపై దూమారం రేగడంతో ఆయన దాన్ని డిలీట్ చేశారు. అసలేం జరిగిందంటే..?

కెనడాలో ట్రక్కు డ్రైవర్లకు ట్రుడో ప్రభుత్వం వ్యాక్సిన్‌ తప్పనిసరి చేసింది. దీంతో వారు ఆందోళన బాటపడ్డారు. అమెరికా-కెనడా సరిహద్దుల వద్ద పెద్దఎత్తున ట్రక్కులను నిలిపి ఆందోళన చేస్తున్నారు. వ్యాక్సినేషన్ తప్పనిసరి నిబంధన తమ స్వేచ్ఛకు, హక్కులకు భంగం కలిగిస్తోందని పేర్కొంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

ఆందోళన చేస్తున్న ట్రక్కు డ్రైవర్లకు ఎలాన్‌ మస్క్ మద్దతు ప్రకటించారు. ‘జస్టిన్ ట్రూడోతో నన్ను పోల్చకండి’ అంటూ హిట్లర్‌ ఫొటోను బుధవారం రాత్రి మాస్క్‌ ట్వీట్‌ చేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో తన ట్వీట్‌ను గురువారం మధ్యాహ్నం డిలీట్ చేశారు. ట్రూడోను హిట్లర్‌తో పోల్చడంపై ఎలాన్ మస్క్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. మస్క్‌ను నాజీ అంటూ విమర్శలు గుప్పిస్తూ ట్రోల్‌ చేస్తున్నారు.

మరోవైపు, వ్యాక్సిన్ తప్పనిసరి నిబంధనను ఎత్తివేయాలంటూ డ్రైవర్లు చేపట్టిన ఆందోళనలు రోజురోజుకీ ఉధృతమవుతున్నాయి. అమెరికా- కెనడా సరిహద్దులను ట్రక్కులతో ముట్టడించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన రహదారులు, బ్రిడ్జిలపై ట్రక్కులను అడ్డంగా పెట్టడంతో దేశం స్తంభించిపోయింది. ట్రక్కు డ్రైవర్లు శాంతించాలని, నిరసనకారులందరూ ఇంటికి వెళ్లాలని ప్రధాని జస్టిన్ ట్రూడో కోరారు.







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని