Elon Musk: 11వ బిడ్డకు తండ్రైన మస్క్‌.. న్యూరాలింక్‌ ఉద్యోగినితో మూడో సంతానం

టెస్లా బాస్‌ ఎలాన్‌ మస్క్‌ ఇటీవల మరోసారి తండ్రి అయినట్లు వార్తలొస్తున్నాయి. దీంతో అతడి సంతానం సంఖ్య 11కు చేరింది.

Published : 23 Jun 2024 12:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఇటీవల మరోసారి తండ్రి అయ్యారు. న్యూరాలింక్‌ స్పెషల్‌ ప్రాజెక్ట్స్‌ హెడ్‌ అయిన షివాన్‌ జెలీస్‌కు మూడో సంతానం జన్మించిందని బ్లూమ్‌ బెర్గ్‌ పేర్కొంది. ఇప్పటికే ఈ జంటకు 2021లో కవలలు పుట్టిన సంగతి తెలిసిందే. మస్క్‌కు ఇప్పటి వరకు మొత్తం 11 మంది సంతానం ఉన్నారు. వీరిలో ఐదుగురు తొలి భార్య జస్టిన్‌ మస్క్‌కు జన్మించారు. మరో ముగ్గురు మ్యూజిషియన్‌ గ్రిమెస్‌కు, ఇంకో ముగ్గురు జెలీస్‌కు పుట్టారు.

2021లో జెలీస్‌కు కవలలు జన్మించిన సమయంలో మస్క్‌ మాట్లాడుతూ ‘‘ఎక్కువ మంది సంతానం లేకపోతే నాగరికత కుంగిపోతుందని.. తన మాటలు రాసిపెట్టుకోవాలని’’ పేర్కొన్నారు. తనతో పిల్లలను కనాలని మస్క్‌ ప్రోత్సహించాడని జెలీస్‌ వెల్లడించారు. తన పిల్లల కోసం నచ్చిన జన్యువుల గురించి ఆలోచించలేను అని ఆమె చెప్పినట్లు వాల్టర్‌ అనే రచయిత రాసిన ఎలాన్ మస్క్‌ బయోగ్రఫీ పేర్కొంది.

మస్క్‌ తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగినులతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం కొత్తకాదు. తనతో పిల్లలను కనాలని మస్క్‌ కోరినట్లు 2013లో స్పేస్‌ ఎక్స్‌ నుంచి ఉద్యోగం మానేసిన ఓ మహిళ పేర్కొంది. అప్పట్లో వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు.. మరో ఇద్దరు ఉద్యోగినులతో ఆయనకు సంబంధాలున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని