Elon Musk: ఉద్యోగినులతో ‘మస్క్‌’ లైంగిక సంబంధం..! అమెరికా నాట సంచలన కథనం

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. తన సంస్థలోని మహిళా ఉద్యోగినులతో ఆయన లైంగిక సంబంధం పెట్టుకున్నారని కథనం ప్రచురితమవడం చర్చనీయాంశంగా మారింది.

Published : 12 Jun 2024 18:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk)పై మరోసారి సంచలన కథనం ప్రచురితమైంది. తన సంస్థ స్పేస్‌ఎక్స్‌ (SpaceX)లో పని చేసే పలువురు మహిళా ఉద్యోగినులతో ఆయన లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు తాజా నివేదిక పేర్కొంది. ఇంటర్న్‌ కోసం వచ్చిన ఓ యువతి కూడా అందులో ఉన్నట్లు తెలిపింది. మస్క్‌ తన కంపెనీలో మహిళలకు అసౌకర్య వాతావరణాన్ని కల్పించారంటూ ‘ది వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ తాజా కథనంలో ఆరోపించింది.

గతంలో ఎలాన్‌ మస్క్‌ కంపెనీలో పనిచేసి వెళ్లిపోయిన మహిళల నుంచి వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఈ వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. మస్క్‌కు డ్రగ్స్‌ తీసుకునే అలవాటు ఉందని.. అప్పుడప్పుడు బోర్డ్‌ సభ్యులతో కలిసి వాటిని తీసుకునేవారని పేర్కొంది. ఈ క్రమంలోనే మహిళా ఉద్యోగులతో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు తెలిపింది. తన పిల్లలకు తల్లి కావాలని ఓ ఉద్యోగినిని ఆయన కోరినట్లు వెల్లడించింది. శృంగారంలో పాల్గొంటే గుర్రాన్ని బహుమతిగా ఇస్తానని 2016లో మస్క్‌ చెప్పినట్లు మరో మహిళ వివరించినట్లు తాజా కథనం పేర్కొంది.

ఆయన ఎంతో మంచి వ్యక్తి..

కంపెనీలో మహిళల కంటే పురుషులకే మస్క్‌ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారట. ఒక్క వేతనం విషయంలోనే వ్యత్యాసం ఉండేదని మాజీ ఉద్యోగిని ఒకరు ఆరోపించారు. మస్క్‌పై వచ్చిన ఈ కథనం సంచలనంగా మారింది. దీనిపై స్పేస్‌ఎక్స్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ గ్విన్‌ స్పందిస్తూ మస్క్‌పై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. ‘‘ఎలాన్‌ మస్క్‌పై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసేందుకే ఈ కథనాన్ని ప్రచురించారు. అదంతా అబద్ధం. అందర్నీ తప్పుదారి పట్టించేందుకు చేసే ప్రయత్నం. నాకు పరిచయమున్న వారిలోకెల్లా మస్క్‌ ఎంతో మంచి వ్యక్తి. ఆయన గురించి వస్తున్న కథనాలను చూసి ఆశ్చర్యపోతున్నా’’ అని పేర్కొన్నారు.

బైడెన్‌ కుమారుడు దోషే

గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్‌ భార్య నికోల్‌ షానన్‌తో మస్క్‌ వివాహేతర సంబంధం సాగించారని ఇటీవల న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ సంబంధం కారణంగా సెర్గీ దంపతులు విడిపోయారని పేర్కొంది. ఈ క్రమంలోనే మరోసారి మస్క్‌ గురించి ఇలాంటి ఓ కథనం ప్రచురితమవడం చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని