Elon Musk: ‘మిస్టర్‌ ట్వీట్‌’గా పేరు మార్చుకున్న మస్క్‌.. యూజర్లలో అయోమయం..!

ట్విటర్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌(Elon  Musk).. తన ఖాతాలో పేరును మిస్టర్‌ ట్వీట్‌గా మార్చుకున్నారు. అంతటితో ఆగకుండా.. తిరిగి ఆ పేరును మార్చుకోలేకపోతున్నట్లు చేసిన ప్రకటన ట్విటర్‌ (Twitter) యూజర్లను గందరగోళానికి గురి చేస్తోంది. 

Updated : 26 Jan 2023 14:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ట్విటర్‌ను కొనుగోలు చేసిన ఎలాన్‌ మస్క్‌ (Elon Musk).. మైక్రోబ్లాగింగ్‌ సైట్‌లో పలు మార్పులకు స్వీకారం చుట్టిన విషయం తెలిసిందే. యూజర్ల అభిప్రాయాలను తెలుసుకునేందుకు పోల్‌ వంటివి చేపట్టిన ఆయన.. బ్లూటిక్‌కు రుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో తన ట్విటర్‌(Twitter) ఖాతాలో పేరును ‘మిస్టర్‌ ట్వీట్‌’గా మార్చుకున్న మస్క్‌.. తిరిగి తన పేరును మార్చుకోలేకపోతున్నానని యూజర్లను తికమక పెట్టే ప్రకటన చేశారు.

‘నా పేరును మిస్టర్‌ ట్వీట్‌గా మార్చుకున్నా. కానీ, తిరిగి దానిని మార్చేందుకు ట్విటర్‌ అనుమతించడం లేదు’ అంటూ స్మైలీ ఎమోజీతో ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌ చేశారు. ఆయన ప్రకటన యూజర్లను అయోమయానికి గురిచేసింది. దీంతో వేల సంఖ్యలో ఆయన ట్వీట్‌కు స్పందిస్తున్నారు. ‘మిస్టర్‌ ట్వీట్‌.. ఈ వేదికను కామెడీ ఛానల్‌గా మారుస్తున్నారా..?’ అంటూ ఓ యూజర్‌ ప్రశ్నించగా.. ‘ఇది నిజంగా హాస్యాస్పదం’ అంటూ మరో యూజర్‌ చెబుతున్నారు. యూజర్లు గందరగోళానికి గురయ్యే విధంగా మస్క్‌ చేసిన ప్రకటనపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు ట్విటర్‌లో కీలక మార్పులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని మస్క్‌ ఇటీవలే ప్రకటించారు. ముఖ్యంగా రికమెండెడ్‌ vs ఫాలోడ్‌ ట్వీట్లను అటూ ఇటు తేలికగా కదల్చడం, యూజర్‌ ఇంటర్ఫేస్‌లో మార్పులు, ట్వీట్‌ వివరాల కోసం బుక్‌ మార్క్‌ బటన్‌, ట్వీట్లలో అక్షరాల సంఖ్య పెంచడం వంటి సౌలభ్యం కల్పించనున్నట్లు మస్క్‌ వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు