Sri Lanka Crisis: శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న మన పొరుగుదేశం శ్రీలంకలో ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మరోసారి...
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న మన పొరుగుదేశం శ్రీలంకలో ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మరోసారి అత్యయిక పరిస్థితి విధించారు. ఈ అర్ధరాత్రి నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని తెలిపారు. ఈ ద్వీప దేశంలో ఎమర్జెన్సీ విధించడం ఇదో రెండోసారి. ఐదు వారాల క్రితం నిరసనకారులు అధ్యక్షభవనాన్ని చుట్టుముట్టడంతో భారీ హింస చేలరేగింది. పలువురు పోలీసులతో పాటు నిరసనకారులు పెద్దఎత్తున గాయపడ్డారు. దీంతో ఆ సమయంలో అధ్యక్షుడు గొటబాయ కొన్నిరోజుల పాటు ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే కారణమంటూ తన పదవి నుంచి వైదొలగాలని ప్రతిపక్షాలతో పాటు నిరసనకారులు గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. అధ్యక్షుడు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు శుక్రవారం దేశవ్యాప్తంగా సమ్మెకు దిగాయి. దీనికి తోడు మరోవైపు వందల సంఖ్యలో నిరసనకారులు, విద్యార్థులు ఆ దేశ పార్లమెంట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు టియర్ గ్యాస్, నీటి ఫిరంగులతో అడ్డుకున్నారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతుండడంతో అధ్యక్షుడు గొటబాయ మరోసారి భద్రతా బలగాలకు అధికారం కల్పించారు. మరోవైపు శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. ఆహార, ఇంధన, ఔషధాల కొరతపాటు విదేశీ మారకద్రవ్యాల నిల్వలు కరిగిపోతుండడంతో శ్రీలంక అల్లాడుతోంది. దానికి తోడు ప్రతిపక్షాలు అధికార పక్షంపై రోజురోజుకూ ఒత్తిడి పెంచుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Pakistan: భారత్‌తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్‌తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది. -
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్‌కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్‌లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్‌లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్‌లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్‌కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్‌కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!