Hijab Protests: నిరసనలపై ఉక్కుపాదం.. ఇరాన్‌పై ఈయూ ఆంక్షలు!
హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు ఇరాన్‌ను కుదిపేస్తున్నాయి. మరోవైపు.. ఈ నిరసనలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌పై ఆంక్షలు విధిస్తున్నట్లు ఐరోపా సమాఖ్య ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు ఇరాన్(Iran)ను కుదిపేస్తున్నాయి. మరోవైపు.. ఈ నిరసనలపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా ఐరోపా సమాఖ్య(EU).. ఈ క్రూరమైన అణచివేత ధోరణిని తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలోనే ఇరాన్‌పై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈయూ సభ్యదేశాల విదేశాంగ మంత్రులు సోమవారం ఈ మేరకు సమావేశమయ్యారు. ఈ ఆంక్షల జాబితాలో ఇరాన్ సమాచార మంత్రితోసహా 11 మంది వ్యక్తులు, నైతిక పోలీసు విభాగం సహా నాలుగు సంస్థలు ఉన్నాయని దౌత్యవేత్తలు ఓ వార్తాసంస్థకు తెలిపారు. ఈయూ వీసాల నిషేధం, ఆస్తుల నిలిపివేత వంటి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో భాగంగా ఇరాన్ అణు ఒప్పందం పునరుద్ధరణ అవసరాన్నీ ప్రస్తావించినట్లు వెల్లడించారు.
‘నైతిక పోలీసు విభాగం.. ఆ పేరుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. అక్కడి అకృత్యాలను మేం చూసీచూడకుండా ఉండలేం’ అని జర్మనీ విదేశాంగ మంత్రి అన్నాలెనా బేర్బాక్ అన్నారు. హింసాత్మక పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. మరిన్ని ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. శాంతియుత నిరసనల అణచివేత, అనేక మంది మహిళల హత్యకు కారణమైన వారిపై ఈ చర్యలు తీసుకున్నట్లు స్వీడన్ విదేశాంగ మంత్రి అన్నే లిండే పేర్కొన్నారు. ‘ఈ తరహా ఇరాన్ పాలన విధానాలు.. గత 40 ఏళ్లలో పనిచేసి ఉండొచ్చు. కానీ, ఇప్పుడు కాదు’ అని లక్సెంబర్గ్ విదేశాంగ మంత్రి జీన్ అసెల్బోర్న్ వ్యాఖ్యానించారు. మరోవైపు.. అమెరికా, బ్రిటన్, కెనడాలు ఇప్పటికే ఇరాన్‌పై తమ ఆంక్షలను ప్రకటించాయి.
తమ దేశంపై దాడులకుగానూ రష్యా.. ఇరాన్ డ్రోన్లను వాడుతోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఇరాన్‌పై ఈయూ మరిన్ని ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మరోవైపు.. ఇరాన్ ఈ ఆంక్షల నిర్ణయాన్ని ఖండించింది. దీనిపై తగువిధంగా స్పందిస్తామని తెలిపింది. ఈయూ సభ్య దేశాల నిర్ణయాలు, చర్యలకు అనుగుణంగా బదులిస్తామని విదేశాంగ ప్రతినిధి నాజర్ కనాని చెప్పారు. ఇదిలా ఉండగా.. మాసా అమీని అనే యువతి మృతితో ఇరాన్లో ఆందోళనలు మొదలైన విషయం తెలిసిందే. ఆమె హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న అభియోగంపై అక్కడి నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేయగా, వారి కస్టడీలో తీవ్రంగా గాయపడి మరణించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
Israel-Hamas War: ఇజ్రాయెల్‌పై దాడి చేసిన సమయంలో హమాస్ ఓ మహిళను నగ్నంగా ఊరేగిస్తూ గాజా తీసుకెళ్లింది. ఆ దృశ్యం తాజాగా ‘ఫొట్ ఆఫ్ ది ఇయర్’గా నిలవడం గమనార్హం. -
నిన్న అమెరికా, నేడు ఐరాస.. కేజ్రీవాల్ అరెస్ట్‌పై యూఎన్ స్పందన
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్‌లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్‌లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్‌లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్‌పై దాడుల పరంపర
ఉక్రెయిన్‌లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్‌ఫోర్డ్‌లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్‌తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్‌తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?