Russia: రష్యాపై సరికొత్త ఆంక్షలు.. రెఫరెండానికి ప్రతీకారంగా ఐరోపా సమాఖ్య నిర్ణయం

రష్యాపై అదనపు అంక్షలు పడనున్నాయి. ఇటీవల రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌ ప్రాంతాల్లో రెఫరెండం నిర్వహించారు. దీనిని అమెరికా, ఐరోపా

Published : 29 Sep 2022 01:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యాపై అదనపు అంక్షలు విధించనున్నారు. ఇటీవల రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌ ప్రాంతాల్లో రెఫరెండం నిర్వహించారు. దీనిని అమెరికా, ఐరోపా సమాఖ్యలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనికి ప్రతీకారంగా సరికొత్త ఆంక్షలు విధిస్తామని ఐరోపా సమాఖ్య పేర్కొంది. రష్యా చర్యలపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మండిపడ్డారు. ప్రపంచ దేశాలు మాస్కోపై మరిన్ని ఆంక్షలు విధించాలని కోరారు.  మాస్కో ఆక్రమించిన నాలుగు ప్రాంతాల్లో గతవారం నుంచి నిన్నటి వరకు రెఫరెండం నిర్వహించడమే కొత్త ఆంక్షలకు ప్రధాన కారణం. మరోవైపు నార్డ్‌స్ట్రీమ్‌ పైప్‌లైన్‌లో రష్యా ఉద్దేశపూర్వకంగానే సమస్యలు సృష్టిస్తోందని ఈయూ ఆరోపించింది. 

తాజాగా కెనడా కూడా రష్యాపై ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో పేర్కొన్నారు. రష్యా చర్య సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ఈ రెఫరెండాన్ని కెనడా ఎప్పటికీ అంగీకరించదని పేర్కొన్నారు. ఆక్రమిత ప్రాంతాల్లోని ప్రజలను కాపాడాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ప్రపంచ దేశాలను కోరారు. 

మరో వైపు రెఫరెండం ఫలితాలను నేడు ప్రకటించవచ్చు. దొనెట్స్క్‌లో దాదాపు 99శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారని, రష్యాకు అనుకూలంగా ఓటింగ్‌ జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆక్రమిత ప్రాంతాలను విలీనం చేసుకొన్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించే అవకాశం ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని