Updated : 18 Apr 2022 15:35 IST

corona: బ్రెడ్డు, పాలు లేవు.. ఉంటే ఇవ్వగలరంటున్న బిలియనీర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆమె కోటీశ్వరురాలు. విలాసవంతమైన జీవితం. పిలిస్తే పలికే నౌకర్లు. ప్రపంచంలోనే ఉత్తమ వెంచర్‌ క్యాపిటలిస్ట్‌గా ఫోర్బ్స్‌ పత్రికలో స్థానం సంపాదించుకుంది.  కానీ ఏం లాభం కరోనా అంతా తలకిందులు చేసింది. చివరికి ఒక బ్రెడ్డు ముక్క కోసం చేతులు చాచి అర్థించాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి.

మహమ్మారి విజృంభిస్తున్న వేళ చైనాలోని షాంఘై పట్టణం లాక్‌ డౌన్‌లో మగ్గుతోంది. ఒక్క రోజులో 20 వేల పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. రెండు కోట్ల జనాభా ఉన్న ఈ నగరంలో తిండి లేక ప్రజలు అల్లాడుతున్నారు. ధనవంతులకూ ఈ కష్టాలు తప్పడం లేదు. అదే ప్రాంతానికి చెందిన బిలియనీర్‌ క్యాథీ షిన్‌ తన కుటుంబం ఆహారం కొరతలో ఇబ్బందులు పడుతోందని , ఎవరైనా స్పందించి సాయం చేయాలని సామాజిక మాధ్యమాల ద్వారా కోరింది. తనను ఆహారం కొనే గ్రూపులో కలపాలని, కనీసం బ్రెడ్డూ పాలు దొరికినా చాలని ఈ మహిళా బిలియనీర్‌ అభ్యర్థించడం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకాలం హుందాతనానికి, దర్పానికి మారుపేరుగా ఉన్న ఆమె పరిస్థితి చూసిన వారంతా కరోనా ముందు ధనవంతుడైనా, పేదవాడైనా ఒక్కటే అనుకుంటున్నారు. 

ప్రస్తుతం అక్కడ విడిగా వెళ్లి ఆహారం కొనే పరిస్థితులు లేవు. ఆహార సరఫరా చేసే సంస్థల్లో సైతం సిబ్బంది వైరస్‌ బారిన పడటంతో ఆ సేవలకూ తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో ప్రజలంతా బృందాలుగా ఏర్పడి ఆన్‌లైన్‌లో ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. వచ్చిన ఆహారాన్ని తలాకాస్తా పంచుకుని కడుపు నింపుకుంటున్నారు. 

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని