Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా పోరు.. పుతిన్‌ ప్రియురాలికి ఆ దేశంలో కష్టాలు!

పుతిన్‌ ప్రియురాలుగా భావిస్తున్న ప్రేయసి అలీనా కబయేవా(38)ను స్విట్జర్లాండ్‌ నుంచి బహిష్కరించాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి.......

Published : 22 Mar 2022 01:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు చేస్తోంది. ప్రపంచ దేశాలు అనేక ఆంక్షలు విధిస్తున్నప్పటికీ పుతిన్‌ సర్కారు మాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఈ నేపథ్యంలో పుతిన్‌ను మానసికంగా బలహీనపరిచేందుకు కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. పుతిన్‌ ప్రియురాలుగా భావిస్తున్న ప్రేయసి అలీనా కబయేవా (38) ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో సెక్యూరిటీ మధ్య జీవిస్తున్నట్లు సమాచారం. దీంతో స్విట్జర్లాండ్‌ నుంచి ఆమెను బహిష్కరించాలంటూ అంతర్జాతీయంగా పనిచేసే ఛేంజ్‌.ఆర్గ్‌ (change.org)లో మూడు దేశాలకు చెందిన కొందరు పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో రష్యా కూడా ఉండటం విశేషం. రష్యాతో పాటు ఉక్రెయిన్‌, బెలారస్‌కు చెందిన వారు ఉన్నారు. ఈ పిటిషన్‌ను సమర్థిస్తూ ఇప్పటి వరకు 50వేల మంది సంతకాలు చేశారు.

జిమ్నాస్ట్‌, ఒలిపింక్స్‌ గోల్డ్‌మెడలిస్ట్‌ అయిన అలీనా కబయేవా తన సంతానంతో ఓ లగ్జరీ విల్లాలో ఉంటోందని సమాచారం. వారిని సురక్షితంగా ఉంచేందుకు రష్యా అధ్యక్షుడే వారిని అక్కడికి పంపించినట్లు తెలుస్తోంది. అయితే పుతిన్‌ మాత్రం అలీనాను తన ప్రేయసిగా అధికారికంగా ఎప్పుడూ ప్రకటించలేదు. పుతిన్‌కు చెందిన యునైటెడ్ రష్యా పార్టీకి ప్రాతినిధ్యం వహించిన అలీనా.. ఆరేళ్లపాటు పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు. ప్రస్తుతం నేషనల్ మీడియా గ్రూప్‌ డైరెక్టర్ల బోర్డు చైర్‌పర్సన్‌గా గత ఏడేళ్లుగా ఆమె పనిచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని