Indo-Pacific: స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్‌కు భారత్‌, అమెరికా మద్దతు

స్వచ్ఛాయుత ఇండో-పసిఫిక్‌ అవసరమని భారత్‌, అమెరికా పిలుపునిచ్చాయి. శుక్రవారం క్వాడ్‌ దేశాల విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం ఆస్ట్రేలియాలో జరిగింది. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ కూడా పాల్గొన్నారు.

Published : 11 Feb 2022 16:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్‌ అవసరమని భారత్‌, అమెరికా పిలుపునిచ్చాయి. శుక్రవారం క్వాడ్‌ దేశాల విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం ఆస్ట్రేలియాలో జరిగింది. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ కూడా పాల్గొన్నారు. భారత్‌ తరపున విదేశాంగశాఖ మంత్రి డాక్టర్‌ ఎస్‌.జైశంకర్‌ ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. అనంతరం శక్రవారం మధ్యాహ్నం ఆయన ట్విటర్లో స్పందించారు. ‘‘సుదీర్ఘమైన ఫలవంతమైన రోజు. ఇప్పుడే క్వాడ్‌ దేశాల విదేశాంగ మంత్రుల స్థాయి 4వ సమావేశం ముగిసింది. మంచి ప్రగతి సాధించాం. అద్భుతమైన ఏర్పాట్లు చేసినందుకు ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి మారిస్‌ పైన్‌కు ధన్యవాదాలు. సమావేశానికి ముందు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌మారిసన్‌ విలువైన సూచనలు ఇచ్చారు ’’ అని వేర్వేరు ట్వీట్లలో పేర్కొన్నారు.

అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా స్వేచ్ఛ, ప్రాదేశిక సార్వభౌమత్వం, స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని కొనసాగించాలని క్వాడ్‌ దేశాల మంత్రులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జైశంకర్‌ మాట్లాడుతూ ‘‘ ఫిబ్రవరి 2021 క్వాడ్‌ సమావేశం తర్వాత భౌగోళిక రాజకీయ,ఆర్థిక పరిణామాల్లో క్లిష్టమైన మార్పులు చోటు చేసుకొన్నాయి’’ అని అన్నారు. ఈ క్రమంలో కీలకమైన ఆసియాన్‌ దేశాలకు సాయం కొనసాగిస్తామని వెల్లడించారు. ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరత కొనసాగించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్‌ అవసరాన్ని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ మరోసారి గుర్తు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని