Marcos Jr: నియంత కొడుకు దేశాధ్యక్షుడుగా ఎలా అయ్యాడంటే..

ఏదైనా పనిలో విజయం సాధించినా, పరాజయం పొందినా దానికి సంకల్పమే ముఖ్యం. గెలవాలన్న సంకల్పం గట్టిగా ఉంటే సమస్యలు అవాంతరాలుగా కాదు మార్గదర్శకాలుగా కనిపిస్తాయి.

Published : 12 May 2022 01:58 IST

మనీలా(ఫిలిప్పీన్):  ఫెర్డినాండ్‌ మార్కోస్‌.. ఈ పేరు గుర్తుందా.. ఫిలిప్పీన్స్‌కు అధ్యక్షుడిగా ఉంటూ అధికారపగ్గాలు అన్ని కేంద్రీకరించుకొని దేశాన్ని దారుణంగా పాలించిన నియంత.. అయితే అదంతా గతం .. 1986లో ఆయన శకం ముగిసింది.. ప్రజా తిరుగుబాటుకు తలొగ్గి  విదేశాలకు పారిపోయారు... సీన్ కట్‌ చేస్తే తాజాగా ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో  ఫిలిప్పీన్స్‌కు నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు మార్కోస్‌ జూనియర్‌. ఒక నియంత కొడుకుగా పడ్డ ముద్రను చెరిపేసి ప్రజల అభిమానాన్ని పొంది అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ‘నా కుటుంబాన్ని చూసి కాదు నన్ను, నా పనులను చూసి ఓటు వేయండంటూ’ ప్రచారం చేసి దేశాధ్యక్ష పదవిని పొందాడు.

పుస్తకం కవర్‌ని చూసి పుస్తకాన్ని నిర్ణయించవద్దు అన్నట్టు నా కుటుంబ చరిత్రను చూసి నన్ను నిర్ణయించవద్దంటూ మార్కోస్‌ ప్రజల్లోకి వెళ్లారు. సోమవారం జరిగిన ఫిలిప్పీన్ అధ్యక్ష ఎన్నికల్లో అతను 31 మిలియన్ల ఓట్లతో (సుమారు 56శాతం) ప్రత్యర్థి రోబ్రెడోపై విజయం సాధించారు. ప్రెసిడెన్షియల్‌ ప్యాలెస్‌ నుంచి బయటకు వెళ్లిపోయి కొన్ని దశాబ్దాల వ్యవధిలో మళ్లీ తిరిగి వచ్చిన ఈ కుటుంబాన్ని ఆశ్చర్యపోయేంత విజయం వరించింది. కానీ ఈ విజయం ఒక్కసారిగా వచ్చింది కాదు.కొన్ని సంవత్సరాలుగా మార్కోస్‌ జూనియర్‌, అతని అనుచరులు తీవ్రంగా కష్టపడ్డారు.

వాస్తవానికి ఆయన తండ్రి ఫెర్డినాండ్‌ మార్కోస్‌ దేశాన్ని దివాళా పట్టించాడు. ఆయన అవినీతికి అంతేలేదు. ఆయన సతీమణి ఇమెల్డాకు వేల జతల పాదరక్షలు ఉండేవి . అతను అధికారంలో ఉన్న సమయంలో పదివేల మంది ప్రత్యర్థులను జైలులో పెట్టి హింసించి చంపేశాడు. దీంతో 1986లో దేశప్రజల తిరుగుబాటుతో కుటుంబ సమేతంగా దేశం వదలి పారిపోయాడు. ఆయన మరణించిన తరువాతే ఆ కుటుంబం ఫిలిప్పీన్స్‌లో అడుగుపెట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని