Viral news: అమెరికా ఫైటర్ జెట్ ఎలా కూలిపోయిందో చూశారా?
అమెరికాకు చెందిన ఫైటర్‌జెట్ రన్‌వేపై కూలిపోయింది. ప్రమాదం నుంచి పైలట్ చాకచక్యంగా తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
టెక్సాస్: అమెరికా వాయుసేన(American Airforce) కు చెందిన ఎఫ్ 35బీ ఫైటర్ జెట్ విమానం(Fighter jet) ల్యాండ్ అవుతున్న క్రమంలో కుప్పకూలిపోయింది.పైలట్ (pilot) చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన టెక్సాస్ (Texas)లోని ఎయిర్‌స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో (Social media) వైరల్‌గా మారింది. ఎయిర్‌స్టేషన్‌లో ఎఫ్ 35 బీ విమానం ల్యాండ్ అయ్యేందుకు చాలా నెమ్మదిగా కదులుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. హెలికాప్టర్ మాదిరిగా ల్యాండ్ చేసేందుకు పైలట్ యత్నించాడు. అయితే, చక్రాలు నేలను తాకిన అనంతరం జెట్ ఒక్కసారిగా అదుపు తప్పింది. ముందుభాగం నేలను ఢీ కొట్టింది. విమానాన్ని నియంత్రించేందుకు పైలట్ ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు పైలట్ పారాచూట్ సాయంతో బయటకు వచ్చేశాడు.ఈ దృశ్యాన్ని అక్కడున్న కొందరు రికార్డు చేసి ట్విటర్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన అత్యవసర సిబ్బంది అక్కడికి చేరుకొని జెట్ పేలకుండా చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపడుతున్నట్లు అమెరికా వాయుసేన ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Kalyan Ram: ఆయనతో నన్ను పోల్చవద్దు.. అంత పెద్దవాణ్ని కాదు: కళ్యాణ్‌రామ్
-
Crime News
Hyderabad: దేశవ్యాప్తంగా వ్యక్తిగత డేటా చోరీ.. పోలీసుల అదుపులో ముఠా
-
Movies News
Samyuktha: ‘విరూపాక్ష’ టీమ్‌పై నటి సంయుక్త ఆగ్రహం
-
India News
Kerala: సమాధిపై క్యూఆర్ కోడ్!.. వైద్యుడైన కుమారుడి స్మృతులకు కన్నవారి నివాళి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Mission venus: 2028లో శుక్రగ్రహ మిషన్!: ఇస్రో అధిపతి సోమనాథ్