Published : 16 May 2022 00:08 IST

NATO: ఇదో చారిత్రక రోజు.. నాటో సభ్యత్వానికి ఫిన్లాండ్‌ అధికారిక ప్రకటన!

హెల్సింకి: నాటో కూటమిలో సభ్యత్వం కోసం దరఖాస్తు చేస్తామని ఫిన్లాండ్‌ అధ్యక్షుడు సౌలి నీనిస్టో, ప్రధాని సనా మారిన్‌ ఆదివారం సంయుక్త అధికారిక ప్రకటన చేశారు. ‘నేడు పార్లమెంట్‌ను సంప్రదించిన అనంతరం.. ఈ మేరకు దరఖాస్తు చేయాలని దేశాధ్యక్షుడు, ప్రభుత్వ విదేశాంగ విధాన కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఇదొక చారిత్రక రోజు. కొత్త శకం మొదలుకానుంది’ అని పేర్కొన్నారు. తదుపరి చర్యగా.. ఫిన్లాండ్‌ పార్లమెంట్ సోమవారం ఈ అంశంపై చర్చించేందుకు సమావేశం కానుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం 200 మంది సభ్యులు గల చట్టసభలో అధికులు ఈ నిర్ణయానికి మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ ప్రక్రియ లాంఛనప్రాయమే కానుంది! అనంతరం.. అధికారిక సభ్యత్వ దరఖాస్తును బ్రస్సెల్స్‌లోని నాటో ప్రధాన కార్యాలయంలో సమర్పిస్తారు.

‘అధ్యక్షుడు, ప్రభుత్వ పరస్పర సహకారంతో ఈ రోజు ఓ ముఖ్యమైన నిర్ణయానికి వచ్చాం. దీన్ని పార్లమెంట్‌ ఆమోదిస్తుందని ఆశిస్తున్నాం’ అని ప్రధాని సనా మారిన్ అన్నారు. ఫిన్లాండ్‌కు రష్యాతో దాదాపు 1,300 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ దేశం 75 ఏళ్లుగా సైనికపరంగా తటస్థంగా ఉంది. అయితే, ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య తరువాత.. దేశంలో రాజకీయ, ప్రజాభిప్రాయం ఒక్కసారిగా నాటో సభ్యత్వానికి అనుకూలంగా మారింది. మరోవైపు.. ఫిన్లాండ్‌ ఈ కూటమిలో చేరితే తీవ్ర పరిణామాలుంటాయని రష్యా పదే పదే హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే తాము ఎవరికీ వ్యతిరేకంగా నాటోలో చేరడం లేదని అధ్యక్షుడు నీనిస్టో స్పష్టత ఇచ్చారు. మీరే దీనికి కారణమయ్యారని మాస్కోనుద్దేశించి విమర్శలు చేశారు.


Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని