Senegal : సెనెగల్‌ పార్లమెంటులో ఎంపీల ఘర్షణ..!

దేశ పార్లమెంట్‌ సాక్షిగా ఎంపీలు తన్నుకొన్న ఘటన సెనెగల్‌లో చోటు చేసుకొంది. ఓ మహిళా ఎంపీపై దాడి చేయడంతో వివాదం మొదలైంది. 

Published : 05 Dec 2022 10:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సెనెగల్‌ పార్లమెంట్‌లో ఎంపీలు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకొంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సెనెగల్‌ ప్రతిపక్ష పార్టీ నాయకుడు మస్సాట్‌ సంబ్‌ తోటి పార్లమెంట్‌ సభ్యురాలు యామి నదియా గింబేను తొలుత చెంపదెబ్బ కొట్టారు. దీంతో పార్లమెంట్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. గింబే అక్కడే ఉన్న ఒక కుర్చీ తీసుకొని సంబ్‌ వైపు విసిరారు. దీంతో అక్కడే ఉన్న చట్టసభ సభ్యులు వారిని విడదీసేందుకు తీవ్ర యత్నాలు చేశారు. ఇరు పక్షాలు తీవ్రంగా దూషించుకొన్నాయి. ఫలితంగా పార్లమెంట్‌ సెషన్‌ను సస్పెండ్‌ చేశారు.

ప్రస్తుత దేశాధ్యక్షుడు సాల్‌కు మూడోసారి పదవి కట్టబెట్టడానికి ఓ ఆధ్యాత్మిక గురువు వ్యతిరేకంగా ఉన్నారు. ఎంపీ గంబే దీనిని తప్పుపట్టారు. ఆమె వైఖరిపై ప్రతిపక్ష నాయకుడు సంబ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి సదరు మహిళా ఎంపీ ఆయన్ను వెక్కిరించడంతో ఈ దాడి జరిగింది. వాస్తవానికి ఈ దేశంలో జులై నుంచి అధికార-ప్రతిపక్షాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. ఆ నెలలో జరిగిన ఓ ఎన్నికలో అధికార పార్టీ ఓడిపోవడమే దీనికి కారణంగా నిలిచింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని