Canada : టొరెంటోలో కాల్పులు.. ఐదుగురి మృతి
కెనడాలో ఓ సాయుధుడు అపార్ట్‌మెంట్‌లో విచ్చలవిడిగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు.
ఇంటర్నెట్‌డెస్క్: ఓ నివాస సముదాయంలో సాయుధుడు విచ్చలవిడిగా కాల్పులకు తెగబడటంతో ఐదుగురు చనిపోయిన ఘటన కెనడాలోని టొరెంటోలో చోటు చేసుకొంది. టొరెంటోకు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలోని వుఘాన్ అనే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నిందితుడు పోలీసు కాల్పుల్లో చనిపోయినట్లు సమాచారం. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులకు నిందితుడికి ఉన్న సంబంధంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సాయంత్రం 7.20 సమయంలో వుఘాన్ వద్ద ఓ దుండగుడు కాల్పులు జరుపుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చిందని యోర్క్ పోలీస్ చీఫ్ జిమ్ మాక్‌స్వెన్ వెల్లడించారు. తమ అధికారి అక్కడకు చేరుకొనే సరికే పరిస్థితి భయంకరంగా ఉందని పేర్కొన్నారు. అక్కడ భవనంలోని చాలా ఫ్లాట్లలో రక్తమోడుతున్న మృతదేహాలు కనిపించాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలీసులు నిందితుడికి మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో హంతకుడు కూడా మరణించాడు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు అదే అపార్ట్‌మెంట్‌కు చెందినవాడా.. బయట వ్యక్తా అనే తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ధ్రువీకరణ లేకుండా మరణించిన వ్యక్తుల వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. ఈ అపార్ట్‌మెంట్ భవనం నుంచి ప్రజలను బయటకు పంపించిన పోలీసులు.. మరెవరైనా నిందితులు దానిలో ఉన్నారా అనే విషయంపై క్షుణ్ణంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇక కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
APMDC: ఏపీలో బీచ్‌శాండ్ మైనింగ్‌కు టెండర్లు.. రూ.వెయ్యికోట్ల ఆదాయమే లక్ష్యం
-
Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్
-
Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!
-
10 Downing Street: బ్రిటన్ ప్రధాని నివాసంలో.. శునకం-పిల్లి కొట్లాట!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Hyderabad: రెండు స్థిరాస్తి సంస్థలకు భారీగా జరిమానా విధించిన రెరా