United Nations: ఐదుగురు ఐక్యరాజ్య సమితి అధికారుల కిడ్నాప్

ఐదుగురు ఐక్యరాజ్య సమితి అధికారులు కిడ్నాప్​కు గురవడం కలకలం రేపింది. దక్షిణ యెమెన్​లో ఐదుగురు ఐక్యరాజ్య సమితి సిబ్బందిని అల్​ఖైదా ఉగ్రవాదులు......

Published : 14 Feb 2022 01:31 IST

సనా: ఐదుగురు ఐక్యరాజ్య సమితి అధికారులు అపహరణకు గురవడం కలకలం రేపింది. దక్షిణ యెమెన్​లో ఐదుగురు ఐక్యరాజ్య సమితి సిబ్బందిని అల్​ఖైదా ఉగ్రవాదులు అపహరించినట్లు యెమన్​ అధికారులు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం వారిని ఎత్తుకెళ్లి, గుర్తుతెలియని ప్రదేశానికి తరలించినట్లు పేర్కొన్నారు. కిడ్నాప్‌నకు గురైన వారిలో నలుగురు యెమన్ దేశస్థులు కాగా, ఒకరు విదేశీయుడు. కాగా ఈ వ్యవహారంపై తమకు సమాచారం అందిందన్న ఐక్యరాజ్య సమితి.. వారిని విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు యూఎన్​ అధికార ప్రతినిధి స్టెఫనీ డుజారిక్ అన్నారు.

యూఎన్​ సిబ్బందిని విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అక్కడి​ ప్రభుత్వం కూడా తెలిపింది. అయితే కొంత డబ్బుతో పాటు యెమన్​లో బందీలుగా ఉన్న తమ వారిని విడిచిపెట్టాలని ఉగ్రవాదులు డిమాండ్ చేసినట్లు పేర్కొంది. యెమన్​లో అపహరణలు సర్వసాధారణంగా మారాయి. ఇక్కడ సాయుధ గిరిజనులు, అల్​ఖైదాతో సంబంధమున్న ఉగ్రవాదులు.. డబ్బులు డిమాండ్‌ చేస్తూ, బందీలుగా ఉన్న తమవారిని విడిపించుకునేందుకు కిడ్నాప్‌లకు పాల్పడుతుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని