US Spelling Bee: అమెరికా స్పెల్లింగ్ బీ విజేతగా దేవ్‌షా..!
అమెరికా స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతి విద్యార్థి విజేతగా నిలిచాడు. దాదాపు 231 మంది పాల్గొన్న పోటీలో ఈ ఘనత సాధించాడు.
ఇంటర్నెట్‌డెస్క్: అమెరికాలో నిర్వహించిన 95వ నేషనల్ స్పెల్లింగ్ బీ (US Spelling Bee) పోటీల్లో భారత సంతతికి చెందిన 14 ఏళ్ల దేవ్‌షా విజేతగా నిలిచాడు. అతడు శామాఫైల్ (psammophile) అనే పదానికి స్పెల్లింగ్ చెప్పి 50 వేల డాలర్ల ప్రైజ్ మనీని గెలుచుకొన్నాడు. శామాఫైల్ అంటే ఇసుక నేలల్లో కనిపించే కనిపించే జీవి లేదా మొక్క అని అర్థం. ఈ పోటీల అనంతరం ట్రోఫీని అందుకొన్న తర్వాత దేవ్ మాట్లాడుతూ ‘‘ఇది నమ్మలేకపోతున్నాను.. ఇప్పటికీ నా కాళ్లు వణుకుతున్నాయి’’ అని పేర్కొన్నాడు. అతడి తల్లి మాట్లాడుతూ కుమారుడి విజయంపై గర్విస్తున్నట్లు పేర్కొన్నారు.
దేవ్ తండ్రి దేవల్ 29 ఏళ్ల క్రితం భారత్ నుంచి అమెరికా వలస వెళ్లి స్థిరపడ్డారు. ఆయనో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఈ సందర్భంగా దేవల్ మాట్లాడుతూ తన కుమారుడు మూడో ఏట నుంచే స్పెల్లింగ్ గుర్తుపెట్టుకొని చెప్పడం మొదలుపెట్టాడని పేర్కొన్నారు. ఆ తర్వాత ది నార్త్‌సౌత్ ఫౌండేషన్ నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నాడని వెల్లడించారు. ఈ సంస్థ భారత్‌లో పిల్లలకు స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది.
గతంలో కూడా దేవ్ స్పెల్లింగ్ బీ పోటీల్లో పాల్గొన్నాడు. 2019లో 51వ స్థానంలో.. 2021లో 76వ స్థానంతో సరిపెట్టుకొన్నాడు. ఈ సారి మాత్రం పోటీల్లో విజేతగా నిలిచి తన కలను నెరవేర్చుకొన్నాడు. ఇక ఈ పోటీల్లో రన్నరప్‌గా ఆర్లింగ్టన్ (వర్జీనియా)కు చెందిన 14ఏళ్ల బాలిక ఛార్లెట్ వాల్ష్ నిలిచారు. మొత్తం 231 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో 11 మంది ఫైనల్స్‌కు చేరుకొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jammu Kashmir: కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Bombay HC: ఔషధాల కొరతతో మరణాలా..? ఆసుపత్రుల్లో మృత్యుఘోషపై బాంబే హైకోర్టు సీరియస్
-
Anitha: అప్పుడు నష్టాలు చూశా.. ఒత్తిడికి లోనయ్యా: అనితా చౌదరి
-
Pawan Kalyan: జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వం: పవన్ కల్యాణ్
-
Karnataka: ఇలాగే వదిలేస్తే కర్ణాటకలో కసబ్, లాడెన్ ఫొటోలు ప్రదర్శిస్తారు: భాజపా నేత సీటీ రవి
-
Asian Games: ఆసియా క్రీడలు.. నీరజ్‌కు స్వర్ణం, కిశోర్‌కు రజతం