Canada: తొలిసారి.. కెనడా దిగువ సభ స్పీకర్‌గా ఆఫ్రో-కెనడియన్‌!

కెనడా పార్లమెంట్‌లోని దిగువసభ స్పీకర్‌గా లిబర్‌ పార్టీకి చెందిన గ్రెగ్‌ ఫెర్గస్‌ ఎన్నికయ్యారు. స్పీకర్‌ పదవి చేపట్టిన తొలి ఆఫ్రో-కెనడియన్‌ గ్రెగ్‌ కావడం విశేషం. 

Updated : 04 Oct 2023 02:43 IST

ఒట్టావా: కెనడా (Canada) పార్లమెంట్‌లోని దిగువసభ స్పీకర్‌గా లిబరల్‌ పార్టీకి చెందిన గ్రెగ్‌ ఫెర్గస్‌ (Greg Fergus) ఎన్నికయ్యారు. ఈ పదవి చేపట్టిన తొలి ఆఫ్రో-కెనడియన్‌ గ్రెగ్‌ కావడం విశేషం. స్పీకర్‌ స్థానానికి గ్రెగ్‌ పార్టీకే చెందిన ఎంపీ సీన్‌ క్యాసే, కన్సెర్వీటివ్‌ పార్టీకి చెందిన క్రిస్‌ డి ఎంట్రిమోంట్‌, గ్రీన్‌ పార్టీకి చెందిన ఎలిజబెత్‌ మేతో గ్రెగ్‌ పోటీ పడ్డారు. 338 మంది సభ్యులున్న సభలో ఓటింగ్‌ నిర్వహించగా.. ప్రత్యుర్థులపై గ్రెగ్‌ విజయం సాధించారు. ‘స్పీకర్‌గా ఎన్నికైన తొలి ఆఫ్రో-కెనడియన్‌ మీరు. ఇది దేశంలోని పౌరులందరికి, ముఖ్యంగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తుంది’’అని గ్రెగ్‌ ఎన్నికపై ఆ దేశ ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) హర్షం వ్యక్తం చేశారు.   

హిట్లర్‌ నాజీ సేనల్లో పని చేసిన ఓ మాజీ సైనికుడిని ఇటీవల కెనడా పార్లమెంటులో ఘనంగా సత్కరించారు. అతడిపై కెనడా దిగువసభ స్పీకర్‌ ఆంథోనీ రోటా ప్రశంసలు కురిపించారు. ఈ ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో రోటా తన స్పీకర్‌ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో అనివార్యంగా నిర్వహించిన ఎన్నికలో గ్రెగ్‌ గెలుపొంది స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని