Bangladesh: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని ఖలీదా ఆరోగ్యం విషమం

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా (78) ఆరోగ్యం విషమంగా ఉందని, శనివారం సాయంత్రం ఆమె తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఢాకాలోని ఎవర్‌కేర్‌ ఆసుపత్రికి తరలించినట్లు బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) ప్రధాన కార్యదర్శి మీర్జా ఫఖ్రుల్‌ ఇస్లాం ఆలంగీర్‌ తెలిపారు.

Published : 24 Jun 2024 05:18 IST

షేక్‌ హసీనా కక్షసాధింపే కారణమంటున్న విపక్షం

ఢాకా: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా (78) ఆరోగ్యం విషమంగా ఉందని, శనివారం సాయంత్రం ఆమె తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఢాకాలోని ఎవర్‌కేర్‌ ఆసుపత్రికి తరలించినట్లు బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) ప్రధాన కార్యదర్శి మీర్జా ఫఖ్రుల్‌ ఇస్లాం ఆలంగీర్‌ తెలిపారు. ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా తన రాజకీయ ప్రత్యర్థిపై వ్యక్తిగత, రాజకీయ కక్షతో వ్యవహరించి విదేశాల్లో మెరుగైన వైద్యం పొందకుండా అడ్డుపడినట్లు ఆరోపించారు. ‘‘మా నాయకురాలు ఖలీదా జియాకు సరైన వైద్యం అందక ఆమె పరిస్థితి విషమంగా మారటం మా దురదృష్టం. ప్రస్తుతం అధికారంలో ఉన్న నిరంకుశ ప్రభుత్వ అణచివేత ధోరణి కారణంగా ఖలీదా జియా చాలాకాలం జైలులో ఉన్నారు’’ అని ఆలంగీర్‌ తెలిపారు. 1991 - 1996, 2001 - 2006 నడుమ పదేళ్లపాటు బంగ్లా ప్రధానిగా పనిచేసిన ఖలీదా జియాకు ఢాకా కేంద్ర కారాగారంలో ఉన్నపుడు ఎటువంటి వైద్యచికిత్స అందలేదన్నారు. గృహనిర్బంధంలో ఉండేలా ఆమెను అనుతించినప్పటికీ, జైలులాంటి ఆంక్షలు కొనసాగినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని