Updated : 14 Mar 2022 05:13 IST

Barack Obama: అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాకు కరోనా పాజిటివ్‌

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం బాగానే ఉన్నట్లు తెలిపారు. ‘‘గత కొన్ని రోజుల నుంచి గొంతు సమస్యతో ఇబ్బంది పడుతున్నాను. ప్రస్తుతానికి బాగానే ఉన్నాను. మిచెల్‌, నేను వ్యాక్సిన్‌ తీసుకున్నాం. పరీక్షల్లో మిచెల్‌కి నెగెటివ్‌గా తేలింది. కేసులు తగ్గినప్పటికీ ఇప్పటివరకు వ్యాక్సిన్‌ తీసుకొని వారుంటే వెంటనే తీసుకోండి’’ అని ఒబామా ట్వీట్‌ చేశారు.  

ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో సాధారణ పరిస్థితులు ఇప్పుడిప్పుడే నెలకొంటున్నాయి. మరోవైపు ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో పోరాడితే చైనాలో మాత్రం కేసుల అలజడి లేదు. ప్రస్తుతం అన్నిదేశాల్లో కరోనా కనుమరుగు అవుతున్న వేళ చైనాలో గరిష్ట సంఖ్యలో కేసులు నమోదు అవుతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. అమెరికాలో గత జనవరిలో రోజువారీగా నమోదైన కేసుల సరాసరి 8 లక్షలు ఉండగా, ప్రస్తుతానికి 35 వేల కేసులు నమోదు అవుతున్నాయి.         


Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని