America Shooting: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. నలుగురి మృతి

అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఒహైయో రాష్ట్రంలోని ప్రముఖ నగరం డేటన్‌ సమీపాన ఉన్న బట్లర్‌ టౌన్‌షిప్‌ అనే చిన్న పట్టణంలో మరోసారి ఓ దుండగుడు కాల్పులు జరిపాడు....

Updated : 07 Aug 2022 10:21 IST

ఒహైయో: అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఒహైయో రాష్ట్రంలోని ప్రముఖ నగరం డేటన్‌ సమీపాన ఉన్న బట్లర్‌ టౌన్‌షిప్‌ అనే చిన్న పట్టణంలో మరోసారి ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతిచెందినట్లు పట్టణ పోలీసులు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. సాయుధుడైన దుండగుడు కారులో సంచరిస్తూ శుక్రవారం మధ్యాహ్నం నుంచి వివిధ ప్రాంతాల్లో కాల్పులకు తెగబడినట్లు తెలిపారు. ప్రస్తుతం అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. 

నిందితుడిని 39 ఏళ్ల స్టీఫెన్‌ మన్రోగా అనుమానిస్తున్నారు. దుండగుడు మారణాయుధాలతో ఉన్న నేపథ్యంలో ఎక్కడైనా కనిపించినా.. దగ్గరకు వెళ్లొద్దని పోలీసులు హెచ్చరించారు. అతడు ప్రయాణిస్తున్నట్లుగా చెబుతున్న కారుకు సంబంధించిన ఫొటోను పోలీసులు విడుదల చేశారు. దుండగుడు ఏ లక్ష్యంతో కాల్పులు జరిపాడన్నది ఇంకా స్పష్టత రాలేదని పోలీసు అధికారులు వెల్లడించారు. నిందితుడికి ఇండియానా పోలీస్‌, షికాగో, లెక్సింగ్టన్‌, కెంటకీ నగరాలతో కూడా సంబంధాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో ఈ నగరాల్లో ఎక్కడో ఒక చోట ఉండి ఉంటారని అనుమానిస్తున్నారు. మన్రో ఇప్పటికే పలు కేసుల్లో శిక్ష అనుభవించి విడుదలైనట్లు పోలీసులు గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని