Partygate: బోరిస్‌ జాన్సన్‌కు మరిన్ని చిక్కులు.. నలుగురు కీలక అధికారుల రాజీనామా

బ్రిటన్ ప్రధాని కార్యాలయంలో నలుగురు కీలక అధికారులు గురువారం రాజీనామా చేశారు. కొవిడ్ నిబంధనలు కఠినంగా ఉన్న సమయంలో వందల మందితో......

Published : 04 Feb 2022 16:35 IST

ఇంగ్లాండ్‌: బ్రిటన్ ప్రధాని కార్యాలయంలో నలుగురు కీలక అధికారులు గురువారం రాజీనామా చేశారు. కొవిడ్ నిబంధనలు కఠినంగా ఉన్న సమయంలో వందల మందితో ప్రధాని బోరిస్​ జాన్సన్ పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో కీలకంగా వ్యవహరించిన అధికారుల రాజీనామా ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం ప్రధానిని మరిన్ని చిక్కుల్లో పడేలా చేసింది.

‘పార్టీగేటు’ వ్యవహారంలో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న బోరిస్‌ జాన్సన్​కు మరో షాక్ తగిలినట్లయ్యింది. అధికార చీఫ్ స్టాఫ్ డాన్ రోజన్​ఫీల్డ్, ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీ మార్టిన్ రైనాల్డ్‌తో పాటు డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ జాక్ డాలీ, సీనియర్ అడ్వైజర్ మునీరా మీర్జా గురువారం రాజీనామాలు చేశారని బ్రిటన్ ప్రధాని కార్యాలయం తెలిపింది. కరోనా సంక్షోభ సమయంలో పార్టీగేట్ వ్యవహారంలో రైనాల్డ్ ముఖ్య పాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయి.

కొవిడ్‌ ఆంక్షలు కఠినంగా అమల్లో ఉండగా అధికారిక నివాసం 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ ఆవరణలో.. 2020 మే 20న గార్డెన్‌ పార్టీతోపాటు జూన్‌ 19న బోరిస్‌ 56వ జన్మదిన వేడుకలు జరిగాయి. కొవిడ్ ఆంక్షలు ఉన్నప్పటికి ఇలా పార్టీ నిర్వహించడంతో ప్రధానిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పార్టీ గేట్ వ్యవహారంలో సీనియర్ సివిల్ సర్వెంట్​ సుగ్రే ఆధ్వర్యంలో విచారణ జరిగింది. పరిపాలనా వైఫల్యంతోపాటు, నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఈ విచారణలో తేలింది. దీంతో స్వయంగా ప్రధాని జాన్సన్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అయితే బోరిస్​ రాజీనామా చేయాలని డిమాండ్లు వెల్లువెత్తున్న సమయంలో నలుగురు అధికారులు పదవుల నుంచి తప్పుకోవడం ఆయన్ను మరిన్ని చిక్కుల్లో పడేలా చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని