Pakistan: 46% మంది పాక్‌ ప్రజలు ఇమ్రాన్‌ ఖాన్‌ను నమ్మట్లేదు

పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌పై ప్రజలు కాస్త అసంతృప్తిగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల ఆయన.. తన ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తోందని స్వీయప్రకటన చేసుకున్నారు. నూతన రాజకీయాలకు ఇమ్రాన్‌ ఖాన్‌ ఒక బ్రాండ్‌ నాయకుడని తెహ్రీక్‌ - ఇ- ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీ

Updated : 07 Feb 2022 16:14 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌పై ప్రజలు కాస్త అసంతృప్తిగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల ఆయన.. తన ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తోందని స్వీయప్రకటన చేసుకున్నారు. నూతన రాజకీయాలకు ఇమ్రాన్‌ ఖాన్‌ ఒక బ్రాండ్‌ నాయకుడని తెహ్రీక్‌ - ఇ- ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీ నేతలు కీర్తించారు. కాగా.. దీనిపై ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ఫలితాల్లో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా కొన్ని వేలమంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వారిలో 46 శాతం మంది ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన ప్రకటనతో విభేదిస్తున్నట్లు తెలిపారు. 30శాతం మంది దేశంలో అవినీతి బాగా పెరిగిందని, ప్రజాసేవ కూడా అంతంతమాత్రంగానే ఉందని పేర్కొన్నారు. ఇటీవల ఖైబర్‌ ప్రావిన్స్‌లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న పీటీఐ పార్టీ నేతలు ఓడిపోవడానికి గల కారణం.. సరైన వ్యక్తులకు టికెట్లు ఇవ్వకపోవడమే అని 62శాతం మంది అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌.. తన దేశానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా పర్యటన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు చైనా కంపెనీలను పాక్‌లో పెట్టుబడులు పెట్టి తమ ప్రభుత్వం ఇచ్చే వెసులుబాట్లను పొందాలని కోరారు. చైనా-పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌లో భాగంగా పాక్‌లోని ప్రత్యేక వాణిజ్య మండళ్లలో చైనా కంపెనీలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. చైనా నుంచి కనీసం 3బిలియన్‌ డాలర్ల పెట్టుబడులనైనా స్వదేశానికి తీసుకెళ్లాలని ఇమ్రాన్‌ భావిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని