G 20 Summit: అధినేతల మధ్య వెల్లివిరిసిన ఆత్మీయత.. బాలిలో మోదీ, బైడెన్‌ ఆలింగనం..!

సోమవారం ఇండోనేషియా చేరుకున్న ప్రధాని మోదీకి అక్కడ సంప్రదాయ స్వాగతం లభించింది. అలాగే బైడెన్, మోదీ ఆత్మీయంగా పలకరించుకున్నారు. 

Updated : 15 Nov 2022 12:16 IST

బాలి: ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మధ్య ఆత్మీయత వెల్లివిరిసింది. ఇండోనేషియాలోని బాలి వేదికగా జరుగుతోన్న జి-20 సదస్సులో భాగంగా వారిద్దరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం(PMO) ట్విటర్‌లో షేర్‌ చేసింది. 

‘బాలిలో జరుగుతోన్న జి-20 సదస్సులో భాగంగా ప్రధాని మోదీ, అధ్యక్షుడు బైడెన్‌ మధ్య ఆత్మీయ సంభాషణ చోటుచేసుకుంది’ అని పీఎంఓ పేర్కొంది. ఇదిలా ఉంటే.. నిన్న ఇండోనేషియా చేరుకున్న ప్రధానికి సంప్రదాయ స్వాగతం లభించింది. దీనిపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. జి-20 సమావేశ వేదిక వద్దకు చేరుకున్న ఆయనకు ఇండోనేషియా అధ్యక్షుడు జొకొ విడొడొ ఆహ్వానం పలికారు. ప్రపంచ ఆర్థిక వృద్ధిని తిరిగి పట్టాలెక్కించడం సహా ఇంధన, ఆహార భద్రత వంటి అంతర్జాతీయ అంశాలపై మోదీ ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించనున్నారు. సమస్యలన్నింటినీ సమష్టిగా ఎదుర్కొనేందుకు భారత్‌ చిత్తశుద్ధితో కృషిచేస్తున్న సంగతిని అక్కడ వివరిస్తానని.. పలు రంగాల్లో మన దేశం సాధించిన విజయాలను చాటిచెప్తానని మోదీ పేర్కొన్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని