G 20 Summit: అధినేతల మధ్య వెల్లివిరిసిన ఆత్మీయత.. బాలిలో మోదీ, బైడెన్ ఆలింగనం..!
సోమవారం ఇండోనేషియా చేరుకున్న ప్రధాని మోదీకి అక్కడ సంప్రదాయ స్వాగతం లభించింది. అలాగే బైడెన్, మోదీ ఆత్మీయంగా పలకరించుకున్నారు.
బాలి: ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య ఆత్మీయత వెల్లివిరిసింది. ఇండోనేషియాలోని బాలి వేదికగా జరుగుతోన్న జి-20 సదస్సులో భాగంగా వారిద్దరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం(PMO) ట్విటర్లో షేర్ చేసింది.
‘బాలిలో జరుగుతోన్న జి-20 సదస్సులో భాగంగా ప్రధాని మోదీ, అధ్యక్షుడు బైడెన్ మధ్య ఆత్మీయ సంభాషణ చోటుచేసుకుంది’ అని పీఎంఓ పేర్కొంది. ఇదిలా ఉంటే.. నిన్న ఇండోనేషియా చేరుకున్న ప్రధానికి సంప్రదాయ స్వాగతం లభించింది. దీనిపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. జి-20 సమావేశ వేదిక వద్దకు చేరుకున్న ఆయనకు ఇండోనేషియా అధ్యక్షుడు జొకొ విడొడొ ఆహ్వానం పలికారు. ప్రపంచ ఆర్థిక వృద్ధిని తిరిగి పట్టాలెక్కించడం సహా ఇంధన, ఆహార భద్రత వంటి అంతర్జాతీయ అంశాలపై మోదీ ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించనున్నారు. సమస్యలన్నింటినీ సమష్టిగా ఎదుర్కొనేందుకు భారత్ చిత్తశుద్ధితో కృషిచేస్తున్న సంగతిని అక్కడ వివరిస్తానని.. పలు రంగాల్లో మన దేశం సాధించిన విజయాలను చాటిచెప్తానని మోదీ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత సంతతి డాక్టర్‌కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్‌లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్‌లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్‌లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్‌కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్‌కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్