Published : 15/01/2022 01:56 IST

కరోనా ముప్పును రెట్టింపు చేసే జన్యువు గుర్తింపు.. పోలాండ్‌ పరిశోధకుల వెల్లడి

వార్సా: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ మరోసారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. భారీ ఎత్తున మరణాలూ నమోదవుతున్నాయి. మరోవైపు వైరస్‌ ముప్పు తీవ్రతను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ముమ్మర పరిశోధనలు కొనసాగిస్తున్నారు. తాజాగా పోలాండ్‌కు చెందిన పరిశోధకులు.. కరోనా కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశాలను, మరణాల ప్రమాదాన్ని రెట్టింపు చేస్తున్న ఓ ప్రత్యేక జన్యువును గుర్తించారు. స్థానిక బయాలిస్టోక్‌ మెడికల్ యూనివర్సిటీ పరిశోధనల అంచనా ప్రకారం.. దాదాపు 14 శాతం పోలాండ్‌ జనాభాలో ఈ జన్యువు ఉంది. అదే యూరప్‌లో తొమ్మిది శాతం, భారత్‌లో 27 శాతం మందిలో ఉంది. ఈ అధ్యయనంపై దేశ ఆరోగ్యశాఖ స్పందిస్తూ.. మహమ్మారితో ఎవరికి ఎక్కువగా ముప్పు ఉందో గుర్తించడంలో ఈ ఆవిష్కరణ సహాయపడుతుందని తెలిపింది. జూన్ చివరి నాటికి కొవిడ్‌ పరీక్షలతోపాటు జన్యు పరీక్షలూ జరపాలని పోలాండ్‌ ప్రణాళికలు రచిస్తోంది.

వైరస్‌బారిన పడినవారిలో అనారోగ్య తీవ్రతను నిర్ణయించే విషయంలో వయస్సు, బరువు, లింగ భేదం తర్వాత ఈ జన్యువే నాల్గో అతి ముఖ్యమైన అంశమని పరిశోధకులు తెలిపారు. ‘జన్యు పరీక్షల సాయంతో.. వైరస్‌ వ్యాప్తి చెందుతున్న సమయంలో తీవ్ర ముప్పు ఉన్న వ్యక్తులను గుర్తించొచ్చు. ఇన్ఫెక్షన్ తీవ్రం కాకముందే వారిని కాపాడుకోవచ్చు’ అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొ.మార్సిన్ మోనియుస్కో చెప్పారు. ఇదిలా ఉండగా.. కరోనాతో పోలాండ్‌లో ఇప్పటికే లక్షకుపైగా మరణాలు నమోదయ్యాయి. మహమ్మారి ఉద్ధృతి సమయంలో ఇక్కడ సగటు మరణాల సంఖ్య 20 శాతం కంటే ఎక్కువగా ఉంది. అయితే.. ఊపిరితిత్తుల వైఫల్యానికి, తద్వారా మరణానికి కారణమవుతున్న ఓ జన్యువు ‘ఎల్‌జెడ్‌టీఎఫ్‌ఎల్‌1’ను ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఇదివరకు కనుగొన్న విషయం తెలిసిందే. దక్షిణాసియా ప్రాంత మూలాలున్న 60 శాతం మందిలో, ఐరోపాలోని 15 శాతం మందిలో ఇది ఉన్నట్లు గుర్తించారు.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని