US: అమెరికా పౌరులు కాని వారూ ఓటు వేయొచ్చు

అమెరికాలోని అతి పెద్ద నగరాల్లో ఒకటైన న్యూయార్క్‌లో ఆదివారం ఓ చరిత్రాత్మక చట్టం రూపొందింది.

Published : 10 Jan 2022 11:16 IST

చరిత్రాత్మక చట్టం రూపొందించిన న్యూయార్క్‌ నగరం

న్యూయార్క్‌: అమెరికాలోని అతి పెద్ద నగరాల్లో ఒకటైన న్యూయార్క్‌లో ఆదివారం ఓ చరిత్రాత్మక చట్టం రూపొందింది. దీని ప్రకారం.. అమెరికా పౌరులు కాని వారు కూడా న్యూయార్క్‌ స్థానిక మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు వేయొచ్చు. నగర మేయర్, సిటీ కౌన్సిల్‌ను ఎన్నుకోవచ్చు. పౌరసత్వం లేకపోయినా చట్టబద్ధంగా నివసిస్తూ ఉంటే చాలు. దాదాపు 8 లక్షల మంది పౌరసత్వం లేని పౌరులకు ఈ చట్టంతో లబ్ధి చేకూరనుంది. నెల రోజుల క్రితం ఇందుకు సంబంధించిన బిల్లును న్యూయార్క్‌ సిటీ కౌన్సిల్‌ భారీ మెజారిటీతో ఆమోదించింది. అదిప్పుడు చట్టంగా మారింది. అయితే ఈ ఓటు హక్కు స్థానిక మున్సిపల్‌ ఎన్నికలకు మాత్రమే పరిమితం. అధ్యక్ష, రాష్ట్ర ఎన్నికలకు వర్తించదు. ఈ కొత్త చట్టంతో న్యూయార్క్‌ నగరంలో చట్టబద్ధంగా కనీసం 30 రోజులు నివసించే పౌరసత్వం లేని ఏ పౌరుడికైనా ఓటు హక్కు లభిస్తుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని