అలారం హెచ్చరించినా..అగ్ని ప్రమాదాన్ని పసిగట్టని అపార్ట్‌మెంట్‌ వాసులు

అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్‌లో ఆదివారం అగ్నిప్రమాదంలో 9 మంది చిన్నారులు సహా 19 మంది మరణించిన నేపథ్యంలో..

Updated : 11 Jan 2022 10:42 IST

న్యూయార్క్‌: అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్‌లో ఆదివారం అగ్నిప్రమాదంలో 9 మంది చిన్నారులు సహా 19 మంది మరణించిన నేపథ్యంలో.. హెచ్చరిక అలారాల పాత్రపై చర్చ మొదలైంది. వాస్తవానికి ప్రమాదం సంభవించిన వెంటనే భవనంలోని అలారాలు మోగినా పెద్దగా పట్టించుకోనట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవల కాలంలో అవి పదేపదే మోగుతుండడంతో బహుశా అలాగే మోగి ఉంటాయని భావించినట్లు సమాచారం. ప్రమాదం నుంచి బయటపడిన ఓ వ్యక్తి సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘భవనంలోని అలారాలు ఇటీవల తరచూ మోగేవి. అందువల్లే ఆదివారం అలారం మోగినా పెద్దగా పట్టించుకోలేదు’’ అని ఆయన చెప్పారు. మరోవైపు, నాలుగు రోజుల క్రితం ఫిలడెల్ఫియాలోని అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించగా, ఎనిమిది మంది చిన్నారులు సహా 12 మరణించారు. 

‘తలుపులు మూయండి.. ప్రాణాలు కాపాడండి’

అగ్నిప్రమాదాలు సంభవించిన సమయంలో భవనం నుంచి బయటకు వచ్చేటప్పుడు వీలైనంత వరకు తలుపులు మూసివేయాలని అమెరికా అగ్నిమాపక విభాగం పౌరులకు పదేపదే విజ్ఞప్తి చేస్తోంది. ‘‘తలుపులు మూయండి.. ప్రాణాలు కాపాడండి’’ అంటూ సామాజిక మీడియాలో సందేశాలు సైతం ఉంచుతోంది. అలా చేస్తే ఒక ఫ్లాట్‌లో చెలరేగిన మంటలు మరో ఫ్లాట్‌కు వ్యాపించే అవకాశంతక్కువని అధికారులు చెబుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని