Spider Man: స్పైడర్‌మ్యాన్ కామిక్ పేజీ రూ.24 కోట్లు!
స్పైడర్‌మ్యాన్.. ఈ పాత్రకు ఉండే క్రేజే వేరు. మార్వెల్ సంస్థ సృష్టించిన ఈ సూపర్ క్యారెక్టర్‌కు పిల్లలు, యువత మనసుల్లో ప్రత్యేకస్థానం ఉంది.
డాలస్: స్పైడర్‌మ్యాన్.. ఈ పాత్రకు ఉండే క్రేజే వేరు. మార్వెల్ సంస్థ సృష్టించిన ఈ సూపర్ క్యారెక్టర్‌కు పిల్లలు, యువత మనసుల్లో ప్రత్యేకస్థానం ఉంది. అందుకే ఇటీవల విడుదలైన ‘స్పైడర్‌మ్యాన్ - నో వే హోమ్’ చిత్రానికి కాసులవర్షం కురిసింది. ఇది అక్కడితో ఆగలేదు. తాజాగా అమెరికాలోని డాలస్‌లో నిర్వహించిన కామిక్ బుక్స్ వేలంలోనూ స్పైడర్‌మ్యాన్ తన ప్రత్యేకత చాటుకున్నాడు. 1984 నాటి ఓ స్పైడర్‌మ్యాన్ కామిక్ పేజీ వేలంలో రూ.24.89 కోట్లకు అమ్ముడుపోయింది. పలు స్పైడర్‌మ్యాన్ చిత్రాల్లో కనిపించే బ్లాక్‌సూట్ స్పైడీ పాత్ర ఈ కామిక్ పేజి ద్వారానే అభిమానులకు పరిచయం అయింది. ఈ సింబయోట్ సూట్ నుంచే వెనమ్ పాత్రను సృష్టించారు రచయితలు. అందుకే ఈ కామిక్ పేజ్ అంటే అభిమానులకు అంత మోజు. మరోవైపు.. డిటెక్టివ్ కామిక్స్ (డీసీ) ఫ్రాంఛైజీకి చెందిన సూపర్‌మ్యాన్ కామిక్స్‌లోని ఓ ఎడిషన్ కూడా స్పైడర్‌మ్యాన్ ధరకు చేరువలోనే అమ్ముడుపోయింది. సూపర్‌మ్యాన్ పాత్రను పరిచయం చేసిన ఎడిషన్‌కు సంబంధించిన కాపీని రూ.23.56 కోట్లకు ఓ అభిమాని దక్కించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Guntur Kaaram: రాజమౌళి చిత్రాల స్థాయిలో ‘గుంటూరు కారం’.. ఆ మాటకు కట్టుబడి ఉన్నా: నిర్మాత నాగవంశీ
-
Babar Azam: టాప్-4 చిన్న విషయం.. ప్రపంచకప్ గెలవడమే మా లక్ష్యం : బాబర్ అజామ్
-
JP Nadda : జేపీ నడ్డా పూజలు చేస్తున్న గణేశ్ మండపంలో అగ్నిప్రమాదం
-
Priyamani: ప్రియమణి విషయంలో మరో రూమర్.. స్టార్ హీరోకి తల్లిగా!
-
Sharad Pawar: ‘ఇండియా’లోకి అన్నాడీఎంకేను తీసుకొస్తారా..? శరద్‌పవార్ ఏమన్నారంటే..