Omicron: తీవ్రంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్‌ ఉప వేరియంట్‌

ఒమిక్రాన్‌ అసలు వైరస్‌ కన్నా, దాని ఉపవేరియంట్‌ వ్యాప్తి తీవ్రంగా ఉన్నట్టు డెన్మార్క్‌ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది..

Updated : 03 Feb 2022 04:42 IST

వ్యాక్సిన్‌ తీసుకోని వారికి ముప్పు అధికం

లండన్‌: ఒమిక్రాన్‌ అసలు వైరస్‌ కన్నా, దాని ఉపవేరియంట్‌ వ్యాప్తి తీవ్రంగా ఉన్నట్టు డెన్మార్క్‌ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది! ఒమిక్రాన్‌ అసలు వేరియంట్‌ (బీఏ1), దాని ఉప-వేరియంట్‌ (బీఏ2)ల వ్యాప్తి తీరు ఎలా ఉందన్న విషయమై స్టాటెన్స్‌ సీరం ఇన్‌స్టిట్యూట్, యూనివర్సిటీ ఆఫ్‌ కోపెన్‌ హేగన్, టెక్నికల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ డెన్మార్క్‌ల పరిశోధకులు ఇటీవల దృష్టి సారించారు.  ‘‘ఒమిక్రాన్‌ అసలు వేరియంట్‌ వ్యాప్తి రేటు 29% కాగా, బీఏ2 వ్యాప్తి రేటు ఏకంగా 39% నమోదైంది. కొవిడ్‌ టీకా రెండు డోసులు తీసుకున్నవారికి కూడా ఉపవేరియంట్‌ సోకుతోంది. వ్యాక్సిన్‌ తీసుకోనివారికి ఈ ముప్పుతో పాటు, ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటోంది’’ అని శాస్త్రవేత్తలు వివరించారు. కాగా- కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు చేపట్టిన మరో పరిశోధనలోనూ ఇలాంటి ఫలితాలే వెల్లడయ్యాయి. ‘‘ఒమిక్రాన్‌ వేరియంట్ల కారణంగా కొవిడ్‌కు గురై, స్వస్థత పొందినవారూ  బూస్టర్‌ డోసు తీసుకోవడం ముఖ్యం. భవిష్యత్తులో పుట్టుకొచ్చే కొత్త వేరియంట్ల నుంచి దీని ద్వారా రక్షణ లభిస్తుంది’’ అని పరిశోధకులు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని