Updated : 26 Jun 2022 06:46 IST

లీసీచాన్స్క్‌పై పట్టుకు రష్యా యత్నం

కీవ్‌: తూర్పు ఉక్రెయిన్‌లోని లీసీచాన్స్క్‌పై పట్టు సాధించడానికి రష్యా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. దీనికి సమీపంలోని సీవీరోదొనెట్స్క్‌పై కొన్ని వారాలుగా అప్రతిహతంగా దాడులు కొనసాగించిన తర్వాత అక్కడి నుంచి ఉక్రెయిన్‌ సేనలు వైదొలగే పరిస్థితిని తీసుకురాగలగడంతో పుతిన్‌ సేనలు ఈ నగరం దిశగా వెళ్తున్నాయి. లీసీచాన్స్క్‌తో సంబంధాల్లేకుండా చేయాలని రష్యా చేస్తున్న ప్రయత్నాల కారణంగా ఉక్రెయిన్‌ సైన్యం వెనుదిరగడానికి కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తూర్పు ప్రాంతాలకు చాలా దూరంగా ఉన్న నగరాలపైనా క్షిపణి దాడుల్ని రష్యా మొదలుపెట్టింది. దక్షిణం వైపు నుంచి తమను దిగ్బంధించేందుకు రష్యా ప్రయత్నిస్తోందని లుహాన్స్క్‌ ప్రాంత గవర్నర్‌ సెర్హీ హైదై తెలిపారు. రష్యా దాడుల ధాటికి సీవీరోదొనెట్స్స్‌ మొత్తం శిథిలాల కుప్పగా మిగిలింది. ఒకప్పుడు 10 లక్షల మంది జనాభా ఉండే ఆ నగరంలో ఇప్పుడు 10,000 మంది కూడా లేరు. అక్కడి అజోట్‌ రసాయన కర్మాగారంలో 500 మంది పౌరులతో పాటు కొందరు ఉక్రెయిన్‌ సైనికులు తలదాచుకున్నారు. డాన్‌బాస్‌ ప్రాంతాన్ని చేజిక్కించుకునేందుకు సీవీరోదొనెట్స్క్‌, లీసీచాన్స్క్‌ కీలకమనే ఉద్దేశంతో పుతిన్‌ సేనలు మొదటి నుంచి వీటిపై దృష్టి సారించాయి. తాజాగా యరోవివ్‌లోని సైనిక శిక్షణ కేంద్రంపై రష్యా సైనికులు రాకెట్‌ దాడి నిర్వహించారు. మరికొన్ని ప్రాంతాల్లోనూ ఈ తరహా దాడులు కొనసాగాయి. బెలారస్‌ వైపు నుంచి కూడా చెర్నిహైవ్‌కు రాకెట్లు వచ్చి పడ్డాయి. మొత్తంమీద 50కి పైగా రాకెట్లను పుతిన్‌ సేనలు సంధించాయి.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని