Russia: రష్యాలోని పాఠశాలపై కాల్పులు.. పలువురు మృతి

మధ్య రష్యాలోని ఇజెవ్స్క్‌ ఓ పాఠశాలపై సోమవారం కాల్పులు జరిగాయి. ఈ పాఠశాలపై దాడి జరిగిన సమయంలో 1000 మంది విద్యార్థులు, 80 మంది టీచర్లు అక్కడ ఉన్నారు.

Updated : 26 Sep 2022 15:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సెంట్రల్‌ రష్యాలోని ఇజెవ్స్క్‌ ఓ పాఠశాలపై సోమవారం కాల్పులు జరిగాయి. ఈ పాఠశాలపై దాడి జరిగిన సమయంలో 1000 మంది విద్యార్థులు, 80 మంది టీచర్లు అక్కడ ఉన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు కనీసం 13 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో ఆ దుండగుడు కూడా ఆత్మహత్య చేసుకొన్నట్లు రష్యా మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 

దాడి చేయడానికి వచ్చిన ఓ ముసుగు దుండగుడు తొలుత అక్కడ ఉన్న గార్డును హత్య చేశాడు. తర్వాత పాఠశాలలోకి ప్రవేశించి విద్యార్థులపై గురిపెట్టి కాల్పులు జరపడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో తరగతులు జరుగుతున్నాయి. గాయపడిన ఓ విద్యార్థిని తీసుకొని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఓ గదిలో దాక్కొంది. పాఠశాలలోని నాలుగో అంతస్తులోకి వచ్చాక దండగుడు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. అతడు దాడి చేయడానికి గల కారణాలు తెలియరాలేదు. దుండగుడి వద్ద రెండు పిస్తోళ్లు ఉన్నట్లు టాస్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. ఇజెవ్స్క్‌ నగరంలో మొత్తం 6.5లక్షల మంది ప్రజలు ఉన్నారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని