యుద్ధంపై నిర్ణయించుకోవాల్సింది జెలెన్స్కీయే: రష్యా
యుద్ధాన్ని ఆపాలా.. వద్దా అన్న విషయం నిర్ణయించుకోవాల్సింది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీయేనని రష్యా స్పష్టం చేసింది.
కీవ్: యుద్ధాన్ని ఆపాలా.. వద్దా అన్న విషయం నిర్ణయించుకోవాల్సింది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీయేనని రష్యా స్పష్టం చేసింది. ఆయన కావాలనుకుంటే రేపే యుద్ధం ముగుస్తుందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కొవ్ తాజాగా తెలిపారు. అమెరికాకు చెందిన ప్రముఖ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి బ్రిట్నీ గ్రైనర్‌ను రష్యా విడుదల చేసింది. ఖైదీల మార్పిడి ఒప్పందంలో భాగంగా రష్యాకు చెందిన ఆయుధాల వ్యాపారి విక్టర్ బౌట్‌ను అమెరికా విడుదల చేయడంతో గ్రైనర్‌ను రష్యా ఆమె స్వదేశానికి పంపింది. ఈ సందర్భంగానే పెస్కొవ్ మాట్లాడారు. రష్యా షరతులను ఉక్రెయిన్ అంగీకరిస్తేనే యుద్ధం ఆగుతుందని రష్యా ఎప్పట్నుంచో చెబుతోంది. క్రిమియాను రష్యాలో అంతర్భాగంగా ఉక్రెయిన్ గుర్తించాలని క్రెమ్లిన్ డిమాండు చేస్తోంది. కానీ జెలెన్స్కీ, ఇతర ఉక్రెయిన్ నేతలు మాత్రం రష్యా ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి అప్పగిస్తేనే యద్ధం ముగుస్తుందని చెబుతున్నారు. పుతిన్ కూడా ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘ ప్రక్రియగానే ఉంటుందని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!