ఫిలిప్పీన్స్‌ గెరిల్లా యోధుడు సిసోన్‌ కన్నుమూత

ఫిలిప్పీన్స్‌ కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు హోసె మరియా సిసోన్‌ (83) శుక్రవారం నెదర్లాండ్స్‌లోని ఒక ఆస్పత్రిలో కన్నుమూశారు.

Published : 18 Dec 2022 05:59 IST

మనీలా: ఫిలిప్పీన్స్‌ కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు హోసె మరియా సిసోన్‌ (83) శుక్రవారం నెదర్లాండ్స్‌లోని ఒక ఆస్పత్రిలో కన్నుమూశారు. 1986లో సిసోన్‌ నాయకత్వంలో జరిగిన ప్రజా తిరుగుబాటు ప్రస్తుత దేశాధ్యక్షుడు మార్కోస్‌ తండ్రి ఫెర్డినాండ్‌ మార్కోస్‌ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైంది. ఫెర్డినాండ్‌ తరవాత అధ్యక్ష పదవి చేపట్టిన కొరజాన్‌ అకీనో జైలు నుంచి సిసోన్‌ను విడుదల చేశారు. ఆ తర్వాత ఆయన స్వచ్ఛందంగా నెదర్లాండ్స్‌కు వెళ్లి ప్రవాస జీవితం గడుపుతున్నారు. 1969లో సిసోన్‌ కమ్యూనిస్టు పార్టీకి సాయుధ విభాగంగా 60 మంది మావోయిస్టు గెరిల్లాలతో న్యూ పీపుల్స్‌ ఆర్మీని ప్రారంభించారు. తర్వాత అది 25,000 మంది సభ్యుల దళంగా ఎదిగింది. ఈ సంస్థ చేపట్టిన సాయుధ తిరుగుబాటులో 40,000మంది గెరిల్లాలు, భద్రతా సిబ్బంది, పౌరులు మరణించారు. వేలాదిమంది మరణాలకు కారకుడైన సిసోన్‌ మరణంతో ఆయన్ను దేశ చట్టాల ప్రకారం శిక్షించే అవకాశం లేకుండా పోయిందని ఫిలిప్పీన్స్‌ రక్షణ శాఖ వ్యాఖ్యానించింది. సిసోన్‌ పూర్వాశ్రమంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని