మా దగ్గర అణుబాంబు ఉంది..

పాకిస్థాన్‌ ఒక అణ్వస్త్ర సామర్థ్యం కలిగి ఉన్న దేశమని, ఈ విషయాన్ని భారత్‌ మర్చిపోకూడదని పాక్‌ మంత్రి, అధికార పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ నేత షాజియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Published : 19 Dec 2022 05:37 IST

కానీ ఆ విషయంలో మాది బాధ్యతాయుత దేశం
పాక్‌ మంత్రి వ్యాఖ్యలు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ఒక అణ్వస్త్ర సామర్థ్యం కలిగి ఉన్న దేశమని, ఈ విషయాన్ని భారత్‌ మర్చిపోకూడదని పాక్‌ మంత్రి, అధికార పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ నేత షాజియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ అణ్వాస్త్రాల హోదా మౌనంగా ఉండేందుకు కాదని, అవసరమైతే వెనక్కు వెళ్లే ప్రసక్తి లేదని ఆమె బెదిరింపు ధోరణిలో మాట్లాడినట్లు ఓ వార్తాసంస్థ వెల్లడించింది. పాక్‌ ఒక బాధ్యతాయుత అణు దేశమని పేర్కొంటూ ఆదివారం మంత్రి షాజియా ఓ ట్వీట్‌ చేశారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌ కంటే మా దేశమే ఎక్కువ త్యాగాలు చేసిందన్న బిలావల్‌ వ్యాఖ్యలను మంత్రి సమర్థించారు. ఇదిలా ఉండగా.. ‘గుజరాత్‌లో ఊచకోతకు కారకుడు’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీపై ఐరాస వేదికగా బిలావల్‌ చేసిన వ్యాఖ్యలను భారత్‌ గట్టిగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. మోదీపై అనాగరికంగా వ్యక్తిగత దాడికి దిగిన తీరు అత్యంత హేయమని ఖండించింది. భాజపా శ్రేణులు సైతం శనివారం దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని