Cheating: 73 లక్షల డాలర్ల అక్రమార్జన.. అమెరికాలో భారతీయుడి ఘరానా మోసం

బరమ శివన్నారాయణ అనే భారతీయ అమెరికన్‌ ఐటీ నిపుణుడు ఓ కంపెనీ అంతర్గత సమాచారాన్ని అక్రమంగా సంపాదించి స్టాక్‌మార్కెట్‌లో 73 లక్షల డాలర్ల లాభాలను ఆర్జించాడని నిర్ధారణ అయింది.

Updated : 30 Dec 2022 09:54 IST

 25 ఏళ్ల జైలు శిక్షపడే అవకాశం

న్యూయార్క్‌: బరమ శివన్నారాయణ అనే భారతీయ అమెరికన్‌ ఐటీ నిపుణుడు ఓ కంపెనీ అంతర్గత సమాచారాన్ని అక్రమంగా సంపాదించి స్టాక్‌మార్కెట్‌లో 73 లక్షల డాలర్ల లాభాలను ఆర్జించాడని నిర్ధారణ అయింది. అతనికి 25 సంవత్సరాల జైలు శిక్ష పడవచ్చు. శివన్నారాయణ కాలిఫోర్నియా రాష్ట్రంలోని సిలికాన్‌ వ్యాలీలో పలు ఐటీ కంపెనీల్లో పనిచేశాడు. తరవాత పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌ అనే కంపెనీకి కాంట్రాక్టర్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో సంస్థ ఐటీ విభాగంలో పనిచేసే ఒక ఉద్యోగితో శివన్నారాయణకు స్నేహం ఏర్పడింది. అతడి ద్వారా కంపెనీ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను అందరికన్నా ముందే సంపాదించేవాడు. దాని ఆధారంగా ఫలితాల వెల్లడి ముందే స్టాక్‌ మార్కెట్‌లో ఆ కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టేవాడు. 2016 అక్టోబరు నుంచి 2017 సెప్టెంబరు వరకు శివన్నారాయణకు తమ కంపెనీ ఆర్థిక సమాచారాన్ని అందించానని ఉద్యోగి ఒప్పుకున్నాడు. ఈ సమాచారాన్ని ఉపయోగించి అతడూ, శివన్నారాయణ స్టాక్‌ మార్కెట్‌లో లాభాలు ఆర్జించినట్లు ఆధారాలు లభించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు