కొవిడ్‌పై వాస్తవ సమాచారం చెప్పండి

కొవిడ్‌ సమాచారం విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని చైనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కోరింది. వ్యాధి తీవ్రతకు సంబంధించిన నిర్దిష్ట, వాస్తవ డేటాను క్రమం తప్పకుండా పంచుకోవాలని తెలిపింది.

Updated : 01 Jan 2023 06:35 IST

చైనాకు స్పష్టం చేసిన డబ్ల్యూహెచ్‌వో

జెనీవా: కొవిడ్‌ సమాచారం విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని చైనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కోరింది. వ్యాధి తీవ్రతకు సంబంధించిన నిర్దిష్ట, వాస్తవ డేటాను క్రమం తప్పకుండా పంచుకోవాలని తెలిపింది. డేటాలో.. జన్యుక్రమ విశ్లేషణ, వ్యాధి తీవ్రత, ఆస్పత్రులపై ప్రభావం, ఐసీయూ చేరికలు, మరణాలు, టీకాల సంఖ్య ఉండాలని స్పష్టం చేసింది. చైనా శాస్త్రవేత్తలు.. డబ్ల్యూహెచ్‌వోతో మరింత సమన్వయం చేసుకొని పనిచేయాలని సూచించింది. ముఖ్యంగా జన్యుక్రమ విశ్లేషణపై సమగ్ర సమాచారం అందించాలని చెప్పింది. ఈ మేరకు ఆ దేశ శాస్త్రవేత్తలను ఆహ్వానించినట్లు కూడా ప్రకటనలో పేర్కొంది.

* చైనా, హాంకాంగ్‌, సింగపూర్‌, కొరియా, థాయ్‌లాండ్‌, జపాన్‌ నుంచి భారత్‌ వచ్చే విమాన ప్రయాణికులు ఇక తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ ధ్రువపత్రం సమర్పించాలి. ఈ మేరకు కేంద్ర పౌరవిమానయానశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. మరోవైపు ఫ్రాన్స్‌, స్పెయిన్‌, ఇంగ్లాండ్‌ కూడా చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై కఠిన ఆంక్షలు విధించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని