కిమ్‌ కుమార్తే వారసురాలా..!

ఉత్తరకొరియాలో కుటుంబ పాలన కొనసాగనుందా? అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ వారసులుగా ఆయన కుటుంబసభ్యుల్లో ఒకరు పగ్గాలు చేపట్టనున్నారా..? అవుననే అంటున్నారు విశ్లేషకులు.

Published : 06 Jan 2023 05:31 IST

సియోల్‌: ఉత్తరకొరియాలో కుటుంబ పాలన కొనసాగనుందా? అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ వారసులుగా ఆయన కుటుంబసభ్యుల్లో ఒకరు పగ్గాలు చేపట్టనున్నారా..? అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఇటీవల కాలంలో కిమ్‌ మూడు సందర్భాల్లో తన కుమార్తెతో కనిపించారు. ఆ దేశ అధికారిక మీడియా కూడా ఆ చిన్నారిని ‘అత్యంత ప్రియమైన బిడ్డ’గా అభివర్ణించింది. ఆమె వయసు 9 నుంచి 10 సంవత్సరాలు ఉండొచ్చని అంటున్నారు. కిమ్‌కు ఈ చిన్నారి రెండో సంతానం. పేరు కిమ్‌ జు ఎ. దక్షిణకొరియా మీడియా వర్గాల ప్రకారం కిమ్‌కు ముగ్గురు పిల్లలు. తొలి సంతానం కుమారుడు. వీరు వరుసగా 2010, 2013, 2017లో జన్మించారు. కిమ్‌కు కూడా వంశపారంపర్యంగానే అధికారానికి వచ్చారు. తండ్రి కిమ్‌ జోంగ్‌-2 2011లో మరణానంతరం పగ్గాలు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని