అంధకారంలో పాకిస్థాన్
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఇప్పటికే గోధుమ పిండి సంక్షోభంతో సతమతమవుతున్న పాక్‌లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది.
ప్రధాన నగరాలకు నిలిచిన విద్యుత్తు సరఫరా
ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఇప్పటికే గోధుమ పిండి సంక్షోభంతో సతమతమవుతున్న పాక్‌లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. సోమవారం ఉదయం 7.30 గంటల నుంచి దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ట్రాన్స్‌మిషన్లలో లోపాల వల్ల ఈ అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు. కరాచీ, లాహోర్ లాంటి ప్రధాన నగరాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడిందని పాకిస్థాన్‌కు చెందిన స్థానిక మీడియా తెలిపింది. గుడ్డు నుంచి క్వెట్టాకు రెండు ట్రాన్స్‌మిషన్ లైన్లలో అంతరాయం ఏర్పడటం వల్ల విద్యుత్ సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు. క్వెట్టా సహా బలూచిస్థాన్‌లోని 22 జిల్లాల్లో విద్యుత్తు సరఫరా లేదని క్వెట్టా విద్యుత్ సరఫరా సంస్థ పేర్కొంది. దేశంలో విదేశీ మారక నిల్వలు పడిపోవడం వల్ల పాక్ పలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. పాకిస్థాన్ ఈ నెలలో కొత్త ఇంధన పరిరక్షణ ప్రణాళికను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. గత ఏడాది అక్టోబరులో పాకిస్థాన్ విద్యుత్తు అంతరాయాన్ని ఎదుర్కొంది. దీని వల్ల దేశంలోని పెద్ద ప్రాంతాలు, ప్రావిన్షియల్ రాజధానులు కరాచీ, లాహోర్‌లో 12 గంటలకు పైగా విద్యుత్ అంతరాయం కలిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం కోర్టు ఆదేశాలనే మార్చేశారు.. పోలీసు కేసు పెట్టాలని ధర్మాసనం ఆదేశం
-
సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు..
-
అప్పుడు హమాలీ.. ఇప్పుడు వడ్రంగి
-
వరద నీటిలో కొట్టుకుపోయిన 190 పశువులు
-
భారతీయులకు వీసాల జారీలో అమెరికా రికార్డు..!
-
Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ మేల్కోకపోయినా ఇబ్బందేం లేదు: సోమనాథ్