నేపాల్‌లో మళ్లీ భూకంపం

పశ్చిమ నేపాల్‌లోని బజురా, బఝాంగ్‌ పర్వత ప్రాంత జిల్లాలను మంగళవారం భూకంపం కుదిపేసింది. భూకంప లేఖినిపై 5.9 తీవ్రత నమోదు కాగా, పదుల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి.

Published : 25 Jan 2023 05:53 IST

5.9 తీవ్రత నమోదు.. కూలిన ఇళ్లు
భారత ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రభావం

కాఠ్‌మాండూ, దిల్లీ: పశ్చిమ నేపాల్‌లోని బజురా, బఝాంగ్‌ పర్వత ప్రాంత జిల్లాలను మంగళవారం భూకంపం కుదిపేసింది. భూకంప లేఖినిపై 5.9 తీవ్రత నమోదు కాగా, పదుల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. పొరుగున ఉన్న వాయవ్య భారత భూభాగంపై కూడా దీని ప్రభావం కనిపించింది. దిల్లీ, జైపుర్‌ నగరాల్లో ప్రజలు భయకంపితులయ్యారు. నేపాల్‌లోని సుదూర్‌పశ్చిమ్‌ ప్రావిన్సు బజూరా జిల్లాలోని మేలా ప్రాంతాన్ని స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.43 గంటల సమయంలో ఈ ఉపద్రవం తాకినట్లు భూకంప మానిని, పరిశోధన కేంద్రం అధిపతి లోక్‌ బిజయ అధికారి తెలిపారు.బజూరా జిల్లా అటవీప్రాంతంలో పైనుంచి బండరాయి దొర్లిపడటంతో గడ్డి కోస్తున్న మహిళ (35) మృతిచెందింది. కొండ చరియలు విరిగిపడటంతో 40 గొర్రెలు వాటి కింద సమాధి కాగా, ఓ వ్యక్తి గాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని