గర్భస్థ శిశువులపైనా కొవిడ్ ప్రభావం
మొదటి దశల్లో కొవిడ్ సోకిన గర్భిణులలో.. పిండంతో పాటు మాయ సైతం తీవ్రంగా ప్రభావితమైందని, గర్భస్థ శిశువు ఎదుగుదల, మెదడు, ఇతర అవయవాలకు ముప్పు వాటిల్లిందని తాజా పరిశోధనలో వెల్లడైంది.
లండన్: మొదటి దశల్లో కొవిడ్ సోకిన గర్భిణులలో.. పిండంతో పాటు మాయ సైతం తీవ్రంగా ప్రభావితమైందని, గర్భస్థ శిశువు ఎదుగుదల, మెదడు, ఇతర అవయవాలకు ముప్పు వాటిల్లిందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా ఒమిక్రాన్ కంటే ముందు వచ్చిన ఉపరకాల వల్ల నష్టం ఎక్కువగా ఉంది. అక్కడక్కడ మాయ విడిపోవడంతో గర్భంలో ఉన్న శిశువు ఎదుగుదల, ఆరోగ్యం దెబ్బతిన్నట్లు ‘ద లాన్సెట్ రీజనల్ హెల్త్-యూరప్ పత్రిక’లో ప్రచురితమైన పరిశోధనలో వెల్లడించారు.మొత్తం 76 మంది గర్భిణుల పిండాలు, మాయకు ఆస్ట్రియాలోని వియన్నా మెడికల్ యూనివర్సిటీ పరిశోధకులు ఎంఆర్ఐ చేశారు. వీరిలో 38 మందికి కొవిడ్ సోకగా, మిగిలిన 38 మంది ఆరోగ్యంగా ఉన్నారు. డెల్టా లాంటి వేరియంట్లు సోకినవారి పిండాలకు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం లాంటి ఇబ్బందులున్నాయని పరిశోధనకు నేతృత్వం వహించిన పాట్రిక్ కీనాస్ట్ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND Vs NZ : అతడి వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవు.. హార్దిక్ వ్యూహాలపై పాక్ మాజీ ఆటగాడి విమర్శలు
-
World News
US- China: 2025లో అమెరికా, చైనా మధ్య యుద్ధం?
-
Politics News
Nara Lokesh: 45 ఏళ్లు దాటిన మహిళలకు పింఛను.. ఆ హామీ ఏమైంది?: నారా లోకేశ్
-
Movies News
SRK: సింహాలు ఇంటర్వ్యూల్లో పాల్గొనవు.. నేనూ అంతే : షారుఖ్ ఖాన్
-
India News
Ladakh: తూర్పు లద్దాఖ్ వద్ద వ్యూహాత్మక రహదారి నిర్మాణం ప్రారంభం
-
General News
NTR-Kalyan Ram: బెంగళూరు చేరుకున్న ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్