2021లో 29 శాతానికి పెరిగిన ఆహార అభద్రత

ఆసియాలో పెరుగుతున్న జనాభా, పేదరికం, అధిక ధరలు.. తినడానికి చాలినంత లేకపోవడం తదితర కారణాలతో ఆహార అభద్రత భారీగా పెరిగిందని ఐరాసకు చెందిన ఆహార-వ్యవసాయ సంస్థ నివేదిక వెల్లడించింది.

Published : 25 Jan 2023 05:52 IST

ఐరాస ఆహార- వ్యవసాయ సంస్థ నివేదిక

బ్యాంకాక్‌: ఆసియాలో పెరుగుతున్న జనాభా, పేదరికం, అధిక ధరలు.. తినడానికి చాలినంత లేకపోవడం తదితర కారణాలతో ఆహార అభద్రత భారీగా పెరిగిందని ఐరాసకు చెందిన ఆహార-వ్యవసాయ సంస్థ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 2021లో ఆహార అభద్రత 29శాతానికి పైగా పెరిగిందని పేర్కొంది. 2014లో ఇది 21 శాతమేనని వెల్లడించింది. ‘‘కొవిడ్‌-19 కారణంగా పెద్దసంఖ్యలో ఉద్యోగాలు పోవడం, ఇతర అవాంతరాలు, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం తదితర కారణాలతో ఆహారం, విద్యుత్తు, ఎరువుల ధరల పెరిగాయి. దీంతో కోట్ల మందికి చాలినంత ఆహారం అందని పరిస్థితి ఏర్పడింది. ఆ ఏడాది.. దాదాపు 50 కోట్ల మంది పోషకాహార కొరత ఎదుర్కొన్నారు. బాధితుల్లో ప్రతి 10 మందిలో 8 మంది దక్షిణాసియావాసులే. మరో 100 కోట్ల మంది మధ్యస్థం నుంచి తీవ్రంగా ఆహార అభద్రతను ఎదుర్కొన్నారు. కరోనా తర్వాత సంవత్సరాల్లో ఆకలి, పోషకాహార లోపం నివారణ కార్యక్రమాలు నిలిచిపోవడమూ ప్రభావం చూపింది’’ అని నివేదిక పేర్కొంది.  ‘‘ఆసియాలో 15-49 మధ్య వయసు మహిళల్లో మూడో వంతు మంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు’’ అని వెల్లడించింది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని