ఉక్రెయిన్‌కు లెపర్డ్-2 ట్యాంకులు
ఉక్రెయిన్ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. రష్యాతో పోరుకు పశ్చిమ దేశాలకు చెందిన అత్యాధునిక యుద్ధ ట్యాంకులు కావాలన్న ఆ దేశ డిమాండ్ నెరవేరబోతోంది.
ప్రాథమికంగా 14 వాహనాలు అందించేందుకు జర్మనీ అంగీకారం
అబ్రామ్స్నూ అందిస్తామన్న అమెరికా
బెర్లిన్: ఉక్రెయిన్ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. రష్యాతో పోరుకు పశ్చిమ దేశాలకు చెందిన అత్యాధునిక యుద్ధ ట్యాంకులు కావాలన్న ఆ దేశ డిమాండ్ నెరవేరబోతోంది. తమ దేశానికి చెందిన అత్యాధునిక లెపర్డ్-2 యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్‌కు అందించేందుకు జర్మనీ తాజాగా అంగీకారం తెలిపింది. తమ ప్రభుత్వం ఉక్రెయిన్‌కు లెపర్డ్-2 యుద్ధ ట్యాంకులను అందించనుందని జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ బుధవారం ప్రకటించారు. ఈ మేరకు తన మిత్ర దేశాలు చేసిన విజ్ఞప్తులను జర్మనీ ఆమోదించింది. ప్రాథమికంగా ఓ కంపెనీ (14 వాహనాలు) లెపర్డ్-2 ఏ6 ట్యాంకులను కీవ్‌కు అందిస్తున్నామని ఓ ప్రకటనలో జర్మనీ ప్రభుత్వం వెల్లడించింది. జర్మనీ దాని మిత్రపక్షాలు కలిపి ఉక్రెయిన్‌కు రెండు బెటాలియన్ల (88 ట్యాంకులు) ట్యాంకులను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు తమ అత్యాధునిక ఎం1 అబ్రామ్స్ యుద్ధ ట్యాంకులను సరఫరా చేసేందుకు ప్రాథమికంగా నిర్ణయించినట్లు అమెరికా అధికారులు మంగళవారం వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా 31 ట్యాంకులను సరఫరా చేస్తామని బుధవారం ఆ దేశ సీనియర్ పరిపాలనాధికారులు ప్రకటించారు.
పనిచేసిన జర్మనీ షరతు: అమెరికా తన ట్యాంకులను కీవ్‌కు ఇస్తేనే తాను ఇస్తానంటూ జర్మనీ పెట్టిన షరతు నేపథ్యంలో అగ్రరాజ్యం తాజా నిర్ణయానికి దోహదం చేసింది. దీంతో తమ ట్యాంకులు వాడాలంటే టెక్నాలజీపై కఠిన శిక్షణ అవసరమని, ఉక్రెయిన్ సైన్యం అందుకు సరైనది కాదంటూ చెబుతూ వచ్చిన అమెరికా చివరికి మాటను వెనక్కు తీసుకున్నట్లైంది. ఉక్రెయిన్‌కు అత్యాధునిక ట్యాంకుల సరఫరా వార్తలపై అమెరికాలోని రష్యా రాయబారి మండిపడ్డారు. ఇది మరో కవ్వింపు చర్య అని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!