ఉద్యోగాలు కోల్పోతున్న వారి పరిస్థితిని అధ్యక్షుడు అర్థం చేసుకోగలరు

గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ కంపెనీలు తమ సిబ్బందిపై లేఆఫ్‌ల అస్త్రం సంధిస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్ష కార్యాలయం స్పందించింది.

Published : 26 Jan 2023 05:37 IST

శ్వేతసౌధం స్పందన

వాషింగ్టన్‌: గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ కంపెనీలు తమ సిబ్బందిపై లేఆఫ్‌ల అస్త్రం సంధిస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్ష కార్యాలయం స్పందించింది. ఓ వ్యక్తి ఉద్యోగం కోల్పోతే ఆ కుటుంబంపై నేరుగా పడే ప్రభావం ఏమిటో అధ్యక్షుడు జో బైడెన్‌ అర్థం చేసుకోగలరని శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ కరీన్‌ జీన్‌ పియరే తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు విధిస్తున్న లేఆఫ్‌ల గురించి విలేకరులు ప్రశ్నించగా.. ఆమె ఈ మేరకు సమాధానం ఇచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్థానానికి బైడెన్‌ అన్ని చర్యలూ తీసుకుంటారని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అమెరికాలో భారతీయులు భారీ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతున్నారు. హెచ్‌-1బీ వీసా నిబంధనల్లో సానుకూలంగా స్పందించాలని తాజాగా ఫౌండేషన్‌ ఫర్‌ ఇండియన్‌ డయాస్పొరా స్టడీస్‌ (ఎఫ్‌ఐఐడీఎస్‌).. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, కాంగ్రెస్‌ సభ్యులకు మొర పెట్టుకుంది. హెచ్‌-1బీ వీసాల పొడిగింపు విషయంలో ఐటీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కరీన్‌ జీన్‌ స్పందించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని