జర్మనీ రైలులో కత్తి దాడి

జర్మనీలో కీల్‌ నుంచి హాంబర్గ్‌ వెళ్తున్న రైలులో ఓ దుండగుడు కత్తితో జరిపిన దాడిలో ఇద్దరు ప్రయాణికులు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగాను, ఇద్దరు స్వల్పంగాను గాయపడ్డారు.

Published : 26 Jan 2023 05:37 IST

ఇద్దరు ప్రయాణికుల మృతి
అయిదుగురికి గాయాలు

బెర్లిన్‌: జర్మనీలో కీల్‌ నుంచి హాంబర్గ్‌ వెళ్తున్న రైలులో ఓ దుండగుడు కత్తితో జరిపిన దాడిలో ఇద్దరు ప్రయాణికులు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగాను, ఇద్దరు స్వల్పంగాను గాయపడ్డారు. నిందితుడు కూడా గాయపడ్డాడని, అతడిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. దాడి వెనుక అతడి ఉద్దేశం ఎమిటన్నదానిపై దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అయితే నిందితుడి వివరాలను వారు బయటపెట్టలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని