ద.కొరియా, జపాన్‌ల మధ్య నీట మునిగిన కార్గో నౌక

దక్షిణ కొరియా-జపాన్‌ మధ్య సరకు రవాణా నౌక బుధవారం తెల్లవారుజామున సాగర జలాల్లో మునిగిపోయింది. జిన్‌ టియాన్‌ అనే ఈ నౌకలో చైనా, మయన్మార్‌లకు చెందిన 22 మంది సిబ్బంది ఉండగా వారిలో ఇద్దరు మృతి చెందారు.

Published : 26 Jan 2023 05:37 IST

ఇద్దరి మృతి.. 8 మంది గల్లంతు

సియోల్‌: దక్షిణ కొరియా-జపాన్‌ మధ్య సరకు రవాణా నౌక బుధవారం తెల్లవారుజామున సాగర జలాల్లో మునిగిపోయింది. జిన్‌ టియాన్‌ అనే ఈ నౌకలో చైనా, మయన్మార్‌లకు చెందిన 22 మంది సిబ్బంది ఉండగా వారిలో ఇద్దరు మృతి చెందారు. తీర రక్షకదళ సిబ్బంది 14 మందిని రక్షించారు. వీరిలో అపస్మారక స్థితిలో ఉన్న 9 మందిని చికిత్స నిమిత్తం విమానాల్లో జపాన్‌కు తరలించారు. తీర రక్షక నౌకలు, విమానాలతో పాటు రెండు వాణిజ్య నౌకలు రంగంలోకి దిగినా, బలమైన గాలులు వీస్తుండటం, జలాలు అల్లకల్లోలంగా ఉండటం వంటి ప్రతికూల పరిస్థితులతో గాలింపు చర్యలకు అవరోధాలు ఎదురవుతున్నాయి. 6,551 టన్నుల బరువున్న ఈ నౌక.. కలప దుంగలతో వెళ్తోంది. పరిస్థితి ప్రమాదకరంగా ఉందంటూ మంగళవారం రాత్రి 11.15 గంటల ప్రాంతంలో నౌక నుంచి కాల్‌ వచ్చిందని, మూడున్నర గంటల అనంతరం నౌక మునిగిపోయిందని తీర రక్షక దళం అధికార ప్రతినిధి తెలిపారు. నౌక ఎలా మునిగిపోయిందీ తెలియరాలేదు. మరో నౌకను ఢీకొన్నట్లు ఆనవాళ్లు లేవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని