మ్యూజియానికి జిల్‌ బైడెన్‌ దుస్తులు

తన భర్త అమెరికా అధ్యక్షుడిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రోజున తాను ధరించిన దుస్తులను ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ స్మిత్సోనియన్‌ మ్యూజియానికి బహుమతిగా బుధవారం స్వయంగా అందించారు.

Published : 27 Jan 2023 05:04 IST

వాషింగ్టన్‌: తన భర్త అమెరికా అధ్యక్షుడిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రోజున తాను ధరించిన దుస్తులను ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ స్మిత్సోనియన్‌ మ్యూజియానికి బహుమతిగా బుధవారం స్వయంగా అందించారు. ‘నా జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజున నా జ్ఞాపకాల వాణిని ఆ దుస్తులు వినిపిస్తున్నాయి’ అని జిల్‌ అన్నారు. జో బైడెన్‌ 2021 జనవరి 20న దేశాధ్యక్షుడిగా పదవీ స్వీకారం చేశారు. ఆ రోజు జిల్‌ బైడెన్‌ నీలి రంగు ట్వీడ్‌ దుస్తులు, కోటు ధరించారు. అదే రోజు రాత్రి వైట్‌హౌస్‌ కార్యక్రమంలో దంతపు రంగు ఉన్ని దుస్తులు, కశ్మీర్‌ కోటు ధరించారు. స్మిత్సోనియన్‌ మ్యూజియం అమెరికా అధ్యక్షులు ప్రమాణం చేసిన రోజున వారి భార్యలు ధరించిన దుస్తులను ప్రత్యేక విభాగంలో ప్రదర్శిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని